Asianet News TeluguAsianet News Telugu

'సీటీమార్' విడుదల వాయిదా, వెనుక అసలు కారణం


లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత సినిమాలు వరస పెట్టి వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ వాయిదాలు మొదలయ్యాయి. తాజాగా మరో సినిమా విడుదల వాయిదా పడింది. గోపీచంద్‌  హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ‘సీటీమార్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా కథానాయికగా సందడి చేయనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవల రానా నటించిన ‘అరణ్య’ చిత్రం హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ మార్చి 26న విడుదల కావల్సి ఉండగా.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సినిమా విడుదల చేయలేదు. తాజాగా సీటీమార్‌ సైతం వాయిదా పడింది. అయితే.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవడంతోనే సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

Gopichands Seetimaarr postponed jsp
Author
Hyderabad, First Published Mar 28, 2021, 2:05 PM IST

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత సినిమాలు వరస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ వాయిదాలు మొదలయ్యాయి. తాజాగా మరో సినిమా విడుదల వాయిదా పడింది. గోపీచంద్‌  హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ‘సీటీమార్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా కథానాయికగా సందడి చేయనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవల రానా నటించిన ‘అరణ్య’ చిత్రం హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ మార్చి 26న విడుదల కావల్సి ఉండగా.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సినిమా విడుదల చేయలేదు. తాజాగా సీటీమార్‌ సైతం వాయిదా పడింది. అయితే.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవడంతోనే సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

  గోపీచంద్ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా వస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు.   'సీటీమార్' పేరుతో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆరోజునా విడుదలకావట్లేదని పేర్కోంది చిత్రబృందం. దీనికి కారణం ఉందని పేర్కోంది చిత్ర యూనిట్.. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని పనులు మిగిలిపోవడం కారణంగా ఏప్రిల్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ... గోపీచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్‌తో పాటు భారీ కమర్షియల్ ఫిల్మ్‌గా వస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే భావోద్వేగభరిత కథాంశం. ప్రతి సన్నివేశం గుండెను తాకేలా ఉంటుంది. దీనికి తోడు మణిశర్మ అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. ఈ `సిటీమార్` చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ముందుగా భావించాం.. అందులో భాగంగా అధికారికంగా ప్రకటించాం. అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తవ్వని కారణంగా సినిమా విడుదలని వాయిదా వేస్తున్నాము.. అని తెలిపారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కాస్తా ఎక్కువుగా ఉందట. దీంతో ఆ పనులు పూర్తి కాని కారణంగా ఈ సినిమాను విడుదలచేయలేకపోతున్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలచేసిన గోపీచంద్, జ్వాలా రెడ్డిగా తమన్నాలుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios