`కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట..` అంటున్నారు గోపీచంద్‌. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం `సీటీమార్‌`. తమన్నా హీరోయిన్‌గా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని నేడు(సోమవారం) విడుదల చేశారు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో ఆంధ్ర మహిళా కబడ్డీ టీమ్‌ కెప్టెన్‌గా గోపీచంద్‌, తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్‌ కెప్టెన్‌గా తమన్నా నటిస్తున్నారు. 

తాజాగా విడుదలైన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. విలన్‌ పాత్రదారి `కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. `అని గాంభీర్యంగా అరవగా, గోపీచంద్‌ ఎంట్రీ ఇవ్వడం, గ్రౌండ్‌లో కబడ్డీ సన్నివేశాలు. విలన్లని గోపీచంద్‌ మట్టుపెట్టించడం ఈ క్రమంలో `కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట` అనే డైలాగ్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సినిమాపై ఈ టీజర్‌ ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. స్పోర్ట్స్ లోని రాజకీయాలు, కబడ్డీని కొందరు ఎలా శాషిస్తున్నారు అనే అంశాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై సినిమా తెరకెక్కుతుంది.  ఏప్రిల్‌ 2న సినిమా విడుదల కానుంది.