కష్టపడి పైకొచ్చి హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యచో మ్యాన్ గోపీచంద్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు.గతంలో యాక్షన్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న గోపి కొన్నేళ్లుగా హిట్స్ లేక సతమతమవుతున్నాడు. 

ప్రస్తుతం గోపి తన ఆశలన్నీ తిరు డైరెక్షన్ లో చేస్తోన్న చాణక్య సినిమాపైనే పెట్టుకున్నాడు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ స్పై గా కనిపించబోతున్నాడు. అసలు విషయంలోకి వస్తే ఎప్పుడు లేని విధంగా గోపీచంద్ మేకింగ్ విషయంలో తన నిర్ణయాలు చెబుతున్నాడట. ఇక లుక్స్ పరంగా మ్యచో మ్యాన్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇటీవల పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన లుక్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. 

ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో కూడా గోపి సొంత నిర్ణయంతో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది సీనియర్ సినీ రాచయితల సలహాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. యాక్షన్ విషయంలో ఏ మాత్రం రాజి పడకుండా ఓపికతో గోపీచంద్ కష్టపడుతున్నాడట. ఆలస్యమయినా పరవాలేదని చిత్ర యూనిట్ ని మోటివేట్ చేస్తున్నాడట. ఇంతలా కష్టపడుతున్న గోపి చాణక్య సినిమా ద్వారా ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.