హీరో గోపీచంద్‌ నటించిన `పక్కా కమర్షియల్‌` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. రాశీఖన్నా కథానాయికగా నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు.

యాక్షన్‌ హీరో, మ్యాచో గోపీచంద్‌(Gopichand) హీరోగా నటిస్తున్న చిత్రం `పక్కా కమర్షియల్‌`(Pakka Commercial). రాశీఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పతాకాలపై బన్నీవాసు నిర్మించారు. ఈ చిత్రం జులై 1న విడుదల కాబోతుంది. దీంతో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో సినిమాని కమర్షియల్‌గా ప్రమోట్‌ చేసేందుకు గట్టి ప్రయత్నాలు షురూ చేయబోతున్నట్టు హింట్‌ ఇచ్చారు. అదే ఊపులో ముందుకు సాగుతున్నారు. 

తాజాగా త్వరలో ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ నెల 12న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్‌. ఈ మేరకు ట్రైలర్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో గోపీచంద్‌, శ్రీనివాస్‌రెడ్డి ఏదో కేస్‌ విషయంలో మాట్లాడుతుండగా, స్ట్రీమింగ్‌ ఆపేసి ఆ తర్వాత గ్యాప్‌ ఇచ్చి, మొన్నటి ప్రెస్‌ మీట్‌లో అల్లు అరవింద్‌ పక్కా కమర్షియలే అని చెప్పిన మాటని, మళ్లీ ట్రైలర్‌లోని సీన్‌ని కలిపి ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. వెరైటీగా ఉన్న ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న విషయం తెలిసిందే. 

YouTube video player

హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 12న ఫుల్ లెంగ్త్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినీ నిర్మాతలు కర్నూల్‌లో భారీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నామని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల మాదిరిగా కాకుండా `పక్కా కమర్షియల్‌` టిక్కెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. `సీటీ మార్‌` తర్వాత గోపీచంద్‌ నుంచి వస్తోన్న సినిమా కావడం, బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు అందుకున్న మారుతి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో దీనిపై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి.