పక్కా కమర్షియల్ అంటున్నాడు గోపీచంద్. హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ డీసెంట్ హీరో.. రీసెంట్ గా సినిమాను కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా పక్కా కామర్షియల్ నుంచి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది మూవీ టీమ్. 

ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. 

ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

YouTube video player

జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కా బోతోంది. ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న రిలీజ్ చేయబోతున్నారు టీమ్. ఇక తాజాగా ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుదలై, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. 

భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో దూసుకుపోతున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా రూపొందుతోంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రతీరోజు పండగే సినిమాలో రాశీఖన్నా కలిసిరావడంతో వెంటనే ఈ సినిమాకు తీసుకున్నాడు మారుతి. ఈ సినిమాకు జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వగానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయబోతున్నారు టీమ్