Mahesh Babu: మరోసారి సూపర్ స్టార్ తో తలపడనున్న గోపీచంద్.. ? డైరెక్టర్ ఎవరంటే..?
మరో సారి సూపర్ కాంబో కలవబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కు విలన్ గా మ్యాచో హీరో గోపీచంద్(Gopichand) నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరి వీరి కాంబినేషన్ లో ఎవరు సినిమా చేయబోతున్నారు...?
మరో సారి సూపర్ కాంబో కలవబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కు విలన్ గా మ్యాచో హీరో గోపీచంద్(Gopichand) నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరి వీరి కాంబినేషన్ లో ఎవరు సినిమా చేయబోతున్నారు...?
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu).. యంగ్ స్టార్ గోపీచంద్(Gopichand). వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే.. క్రేజీ అనే చెప్పాలి. ఎందుకుంటే గతంలో వీరి కాంబినేషన్ ను డైరెక్టర్ తేజా కలిపారు. నిజం సినిమాలో విరు కలిసి నటించారు. అప్పుడు ఆ సినిమా సక్సెస్ కాకపోయినా.. తెలుగు ఆడియ్స్ కు మాత్రం వీరిద్దరి పాత్రలు బాగా గుర్తు ఉండిపోయాయి. దాంతో మరోసారి విరి కాంబోలో సినిమా అనే న్యూస్ వినిపించగానే క్రేజీ.. అంటున్నారు ఆడియన్స్
టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్(Gopichand) ఫస్ట్ మూవీ సక్సెస్ కాకపోవడంతో.. విలన్ గా మారాడు. వర్షం సినిమాలో ప్రభాస్ ను ఢీకోట్టే స్ట్రాంగ్ విలన్ గా అదరగోట్టాడు. ఆతరువాత నిజం సినిమాతో మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. కొంచెం ఇమేజ్ రాగానే మళ్లీ హీరోగా మారిపోయి స్టార్ డమ్ ను అందుకున్నాడు. గోపీచంద్(Gopichand).
ఇక ఇప్పుడు హీరోలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారిలో చాలామంది విలన్ వేషాలను వేయడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ఆకరికి యంగ్ స్టార్ కార్తికేయ లాంటి వారే విలన్స్ గా అదరగొడుతన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా గోపీచంద్(Gopichand) పేరు కూడా చేరాడు.
కెరియర్ బిగినింగ్ లో ఇండస్ట్రీలో ఎలాగైనా సెట్ వ్వడానికి విలన్ వేషం కట్టి.. ఇమేజ్ వచ్చిన తరువాత హీరోగా మారిన గోపీచంద్.. మళ్ళీ విలన్ గా చేయాలి అనుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి.
మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం గోపీచంద్ ను సంప్రదిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే గోపీచంద్ కూడా ఈ పాత్రకోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకుంటే హీరోగా తాను ఫెయిల్ అయినప్పుడు ఇండస్టరీలో తనను నిలబెట్టింది విలన్ వేశాలే. ప్రస్తుతం గోపీచంద్ కు మంచి హిట్ లేదు. ఎన్ని ప్రతయ్నాలు చేసినా.. వరుస ఫెయిల్యూర్స్ అతన్ని వెంటాడుతున్నాయి. దాంతో మరోసారి విలన్ గా మారితు పోలా అనుకుంటున్నాడట స్టార్ హీరో.
అందులోను వచ్చింది చిన్న ఆఫర్ కాదు. సాక్ష్యాత్తు రాజమౌళి(Rajamouli) సినిమాలో.. అది కూడా మెయిన్ విలన్ పాత్రట. అందకే గోపీచంద్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్(Gopichand) మారుతి(Maruthi) డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ మూవీ చేస్తన్నాడు. ఈ మూవీని గీతాఆర్ట్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈసారైన సక్సెస్ వస్తుందేమో అన్న ఆశతో ఉన్నాడు గోపీచంద్.
అటు రాజమౌళి(Rajamouli) ట్రిపుల్ ఆర్(RRR) హడావిడిలో ఉన్నాడు. ఈ సమ్మర్ వరకూ సినిమా రిలీజ్ వ్వడం ఖాయం రావడంతో వెంటనే మహేష్ బాబుతో సినిమాస్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. కాని మహేష్ బాబు సర్కారువారి పాట షూటింగ్ కంప్లీట్ చేసి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో జాయిన్ కాబోతున్నాడు. దాని తరువాత రాజమౌళ కి డేట్స్ ఇస్తాడట. ఈలోపు రాజమౌళి ట్రిపుల్ ఆర్ రిలీజ్ హడావిడి కంప్లీట్ చేసుకుని...రెస్ట్ తీసుకుని.. తరువాత మహేష్ కథపై దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.