గత కొంతకాలంగా సరైనా హిట్ లేక సతమత మవుతున్నాడు గోపిచంద్. ఏ ఒక్క సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటం లేదు. దాంతో ఎక్కడ తన లోపం ఉందని ఆలోచిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.ఇలాంటి సిట్యువేషన్ లో దిల్ రాజు ఓ ప్రపోజల్ పెట్టారు. తన దగ్గర ఉన్న 96 రీమేక్ లో చేయమని అడిగారు. ఆ సినిమా చేస్తే స్ట్రైయిట్ గా మరో సినిమా ఓ పెద్ద డైరక్టర్ తో చేద్దాం అని ప్రపోజల్ పెట్టారట. 

అయితే ఆ సినిమా చూసిన గోపిచంద్ భయపడిపోయాడట. అలాంటి పాత్రలో కనిపిస్తే తన యాక్షన్ ఇమేజ్ ఏమైపోతుందని...దిల్ రాజుకు నో చెప్పేసాడుట. కానీ గోపిచంద్ చేస్తే బాగుంటుందని, అసలు అతని కెరీర్ రొటీన్ సినిమాలు చెయ్యటంవల్లే వెనక్కి వెళ్లిపోయిందని, విభిన్నమైన సినిమాలు చేస్తే అతనికు ఆడియన్స్ మిగులుతారని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా దణ్ణం పెట్టి వెళ్లిపోయాడని ఫిల్మ్ నగర్ టాక్. 

దాంతో దిల్ రాజు కు ఈ రీమేక్ కు హీరో ఎవరిని తీసుకోవాలనే సమస్యమళ్లీ మొదటికి వచ్చిందిట. ముందు నాని అన్నారు. తర్వాత  అల్లు అర్జున్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకువద్దామని దిల్ రాజు చాలా ప్రయత్నం చేసాడు. మొదట ఓకే అనుకున్నా..తర్వాత బన్ని వెనకడుగు వేసాడట. దాంతో  చాలా మంది హీరోలను అనుకుని ఫైనల్ గా గోపిచంద్ దగ్గర ఆగినా ఫలితం లేకుండాపోయింది.

తమిళం లో  ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో   త్రిష .. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవి '96'  అక్టోబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియాన్స్ ని ఫిదా చేయడమే కాదు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 1996 కాలంలో జరిగిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.