యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. రెండు సినిమాలు ప్లాప్ అయితే జాగ్రత్త తీసుకొని వెంటనే మరో సినిమాతో సక్సెస్ అందుకే గోపి ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్నాడు. 

లౌక్యం - జిల్ సినిమాల తరువాత గోపి సినిమాలు పెద్దగా క్లిక్కవ్వలేదు. సౌఖ్యం - గౌతమ్ నందా - ఆక్సిజన్ - పంతం సినిమాలు ఎక్కువరోజులు థియేటర్స్ లో నిలవలేకపోయాయి. ఇక ఆరడుగుల బుల్లెట్ అయితే రిలీజ్ కాకుండా అటకెక్కేసింది. ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని గోపీచంద్ ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ తో రెడీ అవుతున్నాడు. 

కోలీవుడ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో చాణక్య అనే సినిమా చేస్తోన్న గోపి ఆ సినిమా షూటింగ్ ని ఎండ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటీవల డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టారు., మూడు పాటలను ఫినిష్ చేసి సినిమాకు సంబందించినా స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయాలనీ గోపి గ్యాంగ్ ఆలోచిస్తోంది. ఇక మరో రెండు నెలల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ వేస్తున్నట్లు టాక్.