Asianet News TeluguAsianet News Telugu

#Gopichand 'భీమా' రిలీజ్ డేట్ ఫిక్స్..అదే రోజున ఆ పెద్ద సినిమా కూడా

. ముందుగా ఫిబ్రవరి 16న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘భీమా‘.. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న రాబోతుంది. 

Gopichand Bhimaa new release date set for grand release jsp
Author
First Published Jan 30, 2024, 11:34 AM IST


 గోపీచంద్ (Gopichand) చాలా కాలం తర్వాత మళ్లీ హిట్ కొడతాడేమో అనిపించే చిత్రం భీమా (Bheema).యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రం టీజర్‌ ని ఇప్పటికే విడుదల చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ చేశారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష తెలుగు డెబ్యు చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తునారు. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ సైతం అఫీషియల్ గా  ప్రకటించారు. 

మార్చి 8 న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి కావటంతో ఆ తేదినే రిలీజ్ కు పెట్టారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. గోపీచంద్ కి జోడీగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముందుగా ఫిబ్రవరి 16న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘భీమా‘.. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న రాబోతుంది. అయితే.. అదే సమయంలో రామ్, పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్‘ కూడా బరిలో ఉంది. 

Gopichand Bhimaa new release date set for grand release jsp

 ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆధ్యాత్మిక అంశాలతో కూడిన లార్జర్ దెన్ లైఫ్ కథగా ఉంటుంది. గోపీచంద్ పోలీసు అవతార్‌లో మాచోగా కనిపించారు. ఖాకీలో పవర్-ప్యాక్డ్ లుక్‌లో గోపీచంద్ ని చూడటం అభిమానులకు, మాస్‌కి పండుగ. టీజర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హర్ష తన అద్భుతమైన టేకింగ్‌ తో ఆకట్టుకున్నాడు.

 ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష డైరెక్ట్ చేస్తున్న భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  గోపిచంద్ హై వోల్టేజ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.    ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాలు గోపి కెరీర్ లొనే బెస్ట్ మూవీస్ గా నిలిచాయి.  భీమా సినిమాకు స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీలో ఫైట్స్ ఉండబోతున్నాయి.ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios