Asianet News TeluguAsianet News Telugu

#Gopichand కి గడ్డు రోజులు, మరీ అంత తక్కువకి అడుగుతున్నారా? కష్టమే

పర్ఫెక్ట్ గా అతనికి తగ్గట్టుగా ఒక మాస్ స్టోరీ పడితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే వస్తుందని నమ్మి పెట్టుబడిపెడుతున్నారు. 

Gopichand Bheema is yet to close the deal for Hindi dubbing rights jsp
Author
First Published Jan 5, 2024, 8:40 AM IST


ఒక టైమ్ లో గోపిచంద్ సినిమా అంటే మంచి క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఫ్లాఫ్ లు వరస పెట్టి పలకరించటంతో మార్కెట్ డౌన్ అయ్యింది. అయినా అతనికి హిందీ డబ్బింగ్ మార్గెట్ ఉండటంతో నిర్మాతలకు కొదవలేదు. కానీ ఇప్పుడు ఆ మార్కెట్ కు కూడా పడిపోయిందని ట్రేడ్ అంటోంది. గోపంచంద్ సినిమాలని ఒక టైమ్ లో పది నుంచి  12 కోట్లు అడిగిన హిందీ డబ్బింగ్ నిర్మాతలు ఇప్పుడు ఉత్సాహం చూపించటం లేదని అంటున్నారు. గోపిచంద్ రీసెంట్ చిత్రం 5 నుంచి ఆరు కోట్లు మించి ఇవ్వలేమని చెప్పారట. దాంతో ఇప్పుడు మినిమం 15 కోట్లు అయినా హిందీ డబ్బింగ్ ద్వారా వస్తాయని భావించిన నిర్మిత షాక్ తిన్నాడని అంటున్నారు. అందుకు కారణం ..మారుతున్న సినిమా అని, హిందీలోనూ జవాన్, యానిమల్ వంటి మాస్ హిట్స్ రావటమే అంటున్నారు. 

ఇక తొలి నుంచీ మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు  గోపీచంద్. అయితే  బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ పడి ఏళ్లు గడిచిపోయాయి. నిర్మాతలకు మాత్రం నమ్మకం  తగ్గలేదు. పర్ఫెక్ట్ గా అతనికి తగ్గట్టుగా ఒక మాస్ స్టోరీ పడితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే వస్తుందని నమ్మి పెట్టుబడిపెడుతున్నారు. ఆ నమ్మకం వెనక హిందీ డబ్బింగ్ మార్కెట్,ఓటిటి మార్కెట్ ఉన్నాయి. థియేటర్ రెవిన్యూ పెద్దగా రాకపోయినా వాటితో రికవరీ ఉంది. అయితే గోపీచంద్ లాస్ట్ ఫిల్మ్ రామబాణం సినిమా కూడా ధారణంగా దెబ్బకొట్టింది. ఇక ప్రస్తుతం అతని నమ్మకం మొత్తం భీమా అన్స్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాతో అతను రీ బ్యాక్ అవ్వచ్చని భావిస్తున్నాడు.

ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష డైరెక్ట్ చేస్తున్న భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  గోపిచంద్ హై వోల్టేజ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.    ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాలు గోపి కెరీర్ లొనే బెస్ట్ మూవీస్ గా నిలిచాయి.  భీమా సినిమాకు స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీలో ఫైట్స్ ఉండబోతున్నాయి.ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios