‘ఊపిరి’, ప్రేమమ్, ‘గీతా గోవిందం’ వంటి చిత్రాలతో తెలుగు వారికి సైతం నచ్చేసిన మ్యూజిక్ డైరక్టర్ గోపీ సుందర్. ఈ మళయాళ సంగీత దర్శకుడుకి కు బ్రేక్ ఇచ్చిన తన స్వస్ధలంలో కన్నా ఇక్కడే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే గత కొంత కాలంగా ఆయన రిపీట్ మ్యూజిక్ ఇస్తున్నారనే అపవాదు మొదలైంది. అయితే సినిమాలు ఏమీ తగ్గలేదు. ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఆయన పర్శనల్ లైఫ్ లో మాత్రం విడాకులు, మళ్లీ పెళ్లి అనే అధ్యాయంలో ఉన్నారు.

ఈ సంగీత దర్శకుడుకి  కి ప్రియ అనే భార్య .. ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ మధ్య  కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తటం జరిగింది. దాంతో తన భార్య నుంచి విడాకులు కావాలని ఆయన కోర్టును ఆశ్రయించాడు. మరో ప్రక్క గోపి సుందర్ నుంచి విడాకులు తీసుకోవడానికి భార్య కూడా అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో  గోపీసుందర్ ఓ యువ గాయనితో అభయ హిరణ్మయి తో  ప్రేమలో పడ్డాడనీ, ఆమెను పెళ్లి చేసుకునే అవకాశాలు వున్నాయని  వార్తలు వస్తున్నాయి. తాజాగా గోపీ సుందర్ ఈ విషయం ఖరారు చేస్తూ ఆ గాయితో కలిసి రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఓ ఫొటోని షేర్ చేసారు. దాంతో ఒక్క సారిగా ఈ విషయం పబ్లిక్ అయ్యింది. దాంతో మీడియా వారు ఆయన్ని ఈ విషయమై వివరణ అడగటం జరిగింది. దానికి  గోపీసుందర్ స్పందిస్తూ .. " విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది .. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు.