ఇటీవల గూగుల్ 2018లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన వారిలో ప్రియా ప్రకాష్ వారియర్ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఇక టాలీవుడ్ లిస్ట్ గూగుల్ అధికారికంగా విడుదల చేసింది. అందులో మెగాస్టార్ టాప్ లో నిలిచి మరోసారి తన సత్తా చాటుకున్నారు. 

దాదాపు పదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టారా చిరంజీవి మరో సినిమా రిలీజ్ చేయడానికి గ్యాప్ ఎక్కువగానే తీసుకుంటున్నారు. సైరా సినిమాతో సరికొత్తగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల కాకముందే మెగాస్టార్ స్టార్ గురించి ఎన్నో వార్తలు వెలువడ్డాయి. రాజకీయాల్లో కూడా ఆయన ఎక్కువగా కనిపించడం లేదు. 

అయినప్పటికీ మెగాస్టార్ కి సంబందించిన ప్రతి చిన్న విషయం గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ సెర్చ్ చేసినట్లు తేలింది. మెగాస్టార్ తరువాత ఎక్కువగా నాని, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రష్మిక మందాన, అనసూయ భరద్వాజ్, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి వారి గురించి నెటిజన్స్ సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది.