Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే.. ‘సలార్’ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. ఇక ఇంటర్నెట్ షేక్ అవ్వాల్సిందే..

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ‘సలార్’ Salaar అప్డేట్ పై తాజాగా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఫ్యాన్స్ ను ఖుషీ చేసేలా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. 

Good news for Prabhas fans, update from  Salaar movie
Author
Hyderabad, First Published Aug 13, 2022, 3:09 PM IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas) - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సలార్’ (Salaar). చిత్రం సెట్స్ మీదికి వెళ్లినప్పటి నుంచి  అభిమానులు, ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇటీవల ‘సలార్’ నుంచి ఏదైనా అప్డేట్ ఇవ్వాలని దర్శకుడిని, మేకర్స్ ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్యన ‘సలార్’ షూటింగ్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందించిన విషయం తెలిసిందే. తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో కాస్తా అప్సెట్ అయిన ఫ్యాన్స్ ను తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ తో ఖుషీ చేశారు. రెండు రోజుల్లో సలార్ నుంచి అప్డేట్ రానుందని  ఊహించినట్టుగానే.. మొత్తం మీద అనౌన్స్ మెంట్ అందింది. 

లేటెస్ట్ అప్డేట్ లో..  ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సలార్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ అందనుందని మేకర్స్ ప్రకటించారు. ‘సలార్ ది సాగా’ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ‘సలార్  కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ అందించారు.  `సలార్‌` నుంచి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్స్ మాత్రమే వచ్చాయి. గతంలో షూటింగ్ లోకేషన్స్ నుంచి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. వాటితోనే అభిమానులు ఇప్పటి వరకు సరిపెట్టుకున్నారు. 

తాజా అప్డేట్ ప్రకారం.. సలార్ నుంచి వచ్చే అప్డేట్ పై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఈ అప్డేట్ సినిమాని రెండు భాగాలుగా చేయబోతున్నారని, రిలీజ్‌ డేట్‌పై ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఫస్ట్ గ్లింప్స్ వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మరో రెండు రోజుల్లో ఆ మ్యాజిక్ ఆడియెన్స్ ముందుకు రానుంది. ‘సలార్’ అనౌన్స్ మెంట్ తో ప్రస్తుతం ట్విట్టర్ మారుమోగుతోంది. కొన్నాళ్లుగా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇదో పెద్ద గిఫ్ట్ గా ఉండబోతుందని నెటిజన్లు అంటున్నారు. 

మైనింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్‌ (Shruti Haasan) నటిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ విలన్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. `కేజీఎఫ్‌ `తో సంచలనాలు క్రియేట్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘సలార్’పై భారీ అంచనాలున్నాయి. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios