ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే సినిమా విడుదల కాబోతోందని రూమర్స్ వచ్చాయి.  ఇటీవల ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. అందువల్ల ఎలాంటి ఆర్బాటం లేకుండా సినిమా విడుదల కావచ్చని టాక్ వచ్చింది.

తమ హీరోల సినిమాలకు సంబందించిన ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే నందమూరి అభిమానులు గత కొన్ని రోజులుగా ఒక గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే సినిమా విడుదల కాబోతోందని రూమర్స్ వచ్చాయి. 

ఇటీవల ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. అందువల్ల ఎలాంటి ఆర్బాటం లేకుండా సినిమా విడుదల కావచ్చని టాక్ వచ్చింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ ఈవెంట్ జరపకపోతే సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఒక నిర్ణయినికి వచ్చినట్లు టాక్. 

అక్టోబర్ 2న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో భారీగా నిర్వహించాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబందించిన వివరాలను మీడియాకు తెలపనున్నారు. ఇక సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.