Asianet News TeluguAsianet News Telugu

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి ‘ఇంద్ర’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఇంద్ర’ (Indra). మెగా అభిమానుల కోసం ఈ చిత్రపు స్పెషల్ షోస్ ను ప్రదర్శించనున్నారు. తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ అందించారు. 
 

Good news for mega fans, Green signal for Chiranjeevis Indra movie special Show
Author
Hyderabad, First Published Aug 14, 2022, 5:18 PM IST

మెగాస్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్న న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే  బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అభిమానులను అలరిస్తున్న చిరంజీవి (Chiranjeevi) మరోసారి ‘ఇంద్ర’(Indra)తో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు  (Mahesh Babu)ఫ్యాన్స్ కోసం 4కే వెర్షన్ లో వరల్డ్ వైడ్ స్పెషల్ షోస్ వేసిన విషయం తెలిసిందే. మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు గ్రాండ్ ఈవెంట్స్, సేవలతో రికార్డు క్రియేట్ చేశారు. ఇదే తరహాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కోరిక మేరకు కూడా త్వరలో ‘జల్సా’ సినిమాను ప్రదర్శించనున్నారు. తాజాగా మెగాస్టార్ అభిమానుల కోరిక మేరకు 2002లో విడుదలై ఇండియన్ ఫిల్మ్ సత్తా చాటిన ‘ఇంద్ర’ను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘ఇంద్ర’. బీ గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్లుగా సొనాలీ బింద్రే, ఆర్తీ అగర్వాల్ నటించారు. పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సెన్సేషన్  క్రియేట్ చేశారు. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.40 నుంచి రూ.55 కోట్ల మేర వసూళ్లను రాబట్టి.. 2002లో హ్యయేస్ట్ గ్రాసింగ్ సెకండ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 175 రోజులు థియేటర్లలో దద్దరిల్లిందీ చిత్రం. అయితే మూవీ స్పెషల్ షోను 4కే వెర్షన్ లో వైజయంతి మూవీస్ 50వ సంవత్సరం సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ‘ఇంద్ర’ మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు.

‘ఇంద్ర’ చిత్రాన్ని వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ పై నిర్మించగా అశ్విన్ దత్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా వైజయంతి అఫిషియల్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ‘ఇంద్ర’ స్పెషల్ షోస్ పై క్లారిటీ ఇచ్చారు. ట్వీట్ లో.. ‘ప్రియమైన మెగాస్టార్ అభిమానులకు ధన్యవాదాలు. మీరు మాత్రమే కాదు.. మేము కూడా వేచి ఉన్నాం. మేము ఇంద్ర చిత్రం 4K ప్రింట్‌ని తప్పకుండా విడుదల చేస్తాం. కానీ ఇప్పుడే కాదు, కొంత సమయం పడుతుంది. విడుదల మాత్రం బిగ్ అండ్ గ్రాండ్ వేలో ఉంటుంది’ అని తెలిపారు. దీంతో మెగా అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు. త్వరలో థియేటర్ల వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios