సినీ ప్రియులకు ఓ గుడ్‌ న్యూస్‌. శుక్రవారం టికెట్ రేట్లు తగ్గనున్నాయి. 99 రూపాయలకే మల్టీఫ్లెక్స్ లో సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నారు. మరి ఎక్కడ? ఎందుకు? ఎప్పుడు?..

స్టార్ హీరో సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్లు టికెట్‌ రేట్లని అమాంతం పెంచేస్తున్నారు. దాదాపు ఒక్కో టికెట్‌ రేట్‌ 400-500 వరకు రేట్‌ పెంచి టికెట్లని విక్రయిస్తున్నారు. స్టార్‌ హీరోలపై ఉన్న అభిమానాన్ని నిర్మాతలు ఆడియెన్స్ నుంచి ఆ రూపంలో దోచుకుంటున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాల పేరుతో ఇది గత కొన్నేళ్లుగా సాగుతుంది. అయితే మామూలు బడ్జెట్‌ సినిమాలు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్‌ అమ్ముతున్నారు. 

ఇదిలా ఉంటే సినిమా లవర్స్ కి తాజాగా గుడ్‌ న్యూస్‌ ప్రకటించింది ఒక మల్టీఫ్లెక్స్ కంపెనీ. రూ.99లకే టికెట్‌ ధరని నిర్ణయించింది. ఈ సాహసానికి తెరలేపింది `పీవీఆర్‌ఐనాక్స్`. ఫిబ్రవరి 23న `సినిమా లవర్స్ డే`ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్కరోజు మాత్రం రూ.99కే టికెట్‌ని విక్రయించబోతుంది. తమ మల్టీఫ్లెక్స్ స్క్రీన్లలో ఏ సినిమాకైనా ఇది వర్తిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళాలో వర్తిస్తుంది.

అయితే తెలంగాణలో మాత్రం పీవీఆర్‌ ఐనాక్స్ లో రూ.112లకు టికెట్‌ని విక్రయించనున్నట్టు తెలిపింది. మిగిలిన మూడు స్టేట్‌ల కంటే 13 రూపాయలు తెలంగాణలో ఎక్కువగా నిర్ణయించింది. అంతా బాగానే ఉందిగానీ, ఈ ట్విస్టే కాస్త ఇబ్బందిగా మారింది. ఇదిలాఉంటే ఫిబ్రవరి మన తెలుగుగానీ, సౌత్‌లోనూ పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. ఈనేపథ్యంలో ఇలా టికెట్‌ రేట్‌ తగ్గించి ఆడియెన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేసింది పీవీఆర్‌ఐనాక్స్. మరి దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. 

Scroll to load tweet…

తెలుగు స్టేట్స్ లో ఈ శుక్రవారం రామ్‌గోపాల్‌ వర్మ `వ్యూహం`, వైవా హర్ష `సుందరం మాస్టర్‌`తోపాటు `ముఖ్య గమనిక`, మమ్ముట్టి మలయాళమూవీ `భ్రమయుగం` వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. 

Read more: అల్లు అర్జున్, మహేష్ బాబుకి పోటీగా రవితేజ బిజినెస్.. ప్లానింగ్ అదుర్స్