Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్, మహేష్ బాబుకి పోటీగా రవితేజ బిజినెస్.. ప్లానింగ్ అదుర్స్

సినీ తారలు ఎప్పుడూ సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్లు.. ఇతర నటీనటులు సినిమాలు చేస్తూనే వ్యాపార రంగంలో కూడా రాణిస్తుంటారు.

Mass maharaj Ravi Teja to start ART Cinemas soon dtr
Author
First Published Feb 21, 2024, 10:27 PM IST

సినీ తారలు ఎప్పుడూ సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్లు.. ఇతర నటీనటులు సినిమాలు చేస్తూనే వ్యాపార రంగంలో కూడా రాణిస్తుంటారు. సినిమా అనుబంధ వ్యాపారాలు లేదా ఇతర వ్యాపారాలు ఉన్న నటీనటులు చాలా మందే ఉన్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. అదే విధంగా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఏఎంబి సినిమాస్ ప్రస్తుతం అద్భుతంగా రన్ అవుతోంది. మరో వైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏఏఏ సినిమాస్ అంటూ మల్టిఫ్లెక్స్ ని ప్రారంభించారు. గత ఏడాది ఈ మల్టిఫ్లెక్స్ ప్రారంభం అయింది. 

Mass maharaj Ravi Teja to start ART Cinemas soon dtr

ఇప్పుడు ఇదే బాటలో మాస్ మహారాజ్ రవితేజ పయనిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరికీ పోటీగా రవితేజ మల్టీఫ్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు రవితేజ నటిస్తున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో దిల్ షుక్ నగర్ లో భారీ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

6 స్క్రీన్స్ ఉన్న మల్టీ ఫ్లెక్స్ ని నిర్మిస్తున్నారట. ఈ మల్టీ ఫ్లెక్స్ కి ART ఏఆర్టి అని నామకరణం కూడా చేబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం రావడం లేదు. ధమాకా తర్వాత ఈ మాస్ మహారాజ్ కి సరైన హిట్ లేదు. చివరగా విడుదలైన ఈగల్ మూవీ కూడా నిరాశపరిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios