కీర్తి సురేష్ నటించిన తొలి క్రీడా నేపథ్య చిత్రమిది. నగేష్ కుకునూర్ తెరకెక్కించారు. కరోనా పరిస్థితుల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం.. పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కీర్తి సురేశ్ గ్రామీణ యువతిగా నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' సినిమా రూపొంది రిలీజైన సంగతి తెలిసిందే. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమా అనుకున్న స్దాయిలో భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. రకరకాల కారణాలతో రిలీజ్ డేట్ లైట్ అయ్యి జనవరి నెల 28వ తేదీన రిలీజైన ఈ సినిమాకు కీర్తి సురేష్ క్రేజ్ సరిపోలేదు. రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. దానికి తోడు కరోనా టైమ్ లో జనం అసలు థియోటర్స్ కు రాకపోవటం దెబ్బ కొట్టింది.
ఇవన్ని తెలిసీ రిలీజ్ చేయటం అంటే మ్రొక్కుబడిగా రిలీజ్ చేయటం అన్నట్లు అయ్యింది. శాటిలైట్,ఓటిటి సంస్దలు థియోటర్ రిలీజ్ అయ్యిన సినిమాలకు ఎక్కువ వాల్యూ ఇస్తూంటాయి. అందుకే రిలీజ్ చేసారనే అనుమానం చాలా మందికి వచ్చింది. మొత్తానికి థియోటర్ లో రిలైజైంది చూడలేకపోయాం అని ఓటిటి లలో చూద్దామనే వారి కోసం ఓటిటి రిలీజ్ డేట్ వచ్చింది . పిబ్రవరి 12 న రిలీజ్ చేస్తున్నామని ఓటిటి సంస్ద అమేజాన్ అఫీషియల్ గా ప్రకటించింది.
కథ విషయానికి వస్తే...ఊర్లో అందరూ కీర్తి సురేష్ ని బ్యాడ్ లక్ సఖిగా చూస్తుంటారు. ఎందుకంటే ఆమె ప్రతి ఒక్కరికీ దురదృష్టాన్ని తెస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. ఆడవారికి షూటింగ్ ఏంటని గ్రామస్థులు వ్యతిరేకించినప్పటికీ.. ఆది ఆమె పేరునే జగపతి బాబుకు సిఫార్సు చేసాడు. దాంతో కోచ్ జగపతి బాబు లక్ష్యాన్ని సాధించేలా ఆమెను ప్రేరేపిస్తాడు. ఈ క్రమంలో బ్యాడ్ లక్ సఖి కాస్త గుడ్ లక్ సఖి అని ఎలా అనిపించుకుంది? దేశానికి పేరు తెచ్చే షూటర్ గా ఎలా ఎదిగింది? అనేది ఈ సినిమాలో చూపించారు. స్పూర్తిదాయకమైన కంటెంట్ తో సినిమా రూపొందిందిది. కమర్షియల్ హంగులన్నీ మేళవించి దర్శకుడు నాగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. గుడ్ లక్ సఖి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటిలో ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.
