అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురరుచూస్తున్న మూవీల్లో కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ఒకటి. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం నిర్వహించున్నారు. అయితే ఈమెంట్ కు రానున్న చీఫ్ గెస్ట్ ను మార్చారు.   

చాలా కాలం క్రితం స్టార్ట్ అయ్యింది కీర్తి సురేష్(Keerthi Suresh) గుడ్ లక్ సఖీ(Good Luck Sakhi) మూవీ. కరోనా వల్ల అన్ని సినమాలతో పాటు ఈసినిమాకు కూడా గ్యాప్ వచ్చింది. ఇక లేట్ చేయకుండా రిలీజ్ బరిలో నిలిపారు మూవీని. మహానటితో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్(Keerthi Suresh)ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా, స్పోర్ట్స్ రొమ్‌-కామ్ గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు(Dil Raju) సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ సినిమాను నిర్మించారు.

ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో రూపొందిన సినిమాగా టాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది గుడ్ లక్ సఖీ సినిమా. ఈ మూవీని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ఈ మూవీని జ‌న‌వ‌రి 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు హోటల్ హయత్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా మెగా స్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. కాగా ఆయన కూడా హాజరవుతున్నట్టు తెలిపారు. కానీ తాజా ఈ ఉదయమే ఆయన కరోణా బారిన పడ్డారు. వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దీంతో చీఫ్ గెస్ట్ గా ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నారు.

Scroll to load tweet…

దీంతో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్టు సమాచారం. ఈ మేరకు ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు కూడా ఈ విషయాన్ని నిజమనే అంటున్నారు. దీంతో ఈవెంట్ సక్కెస్ అవుతుందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.