Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్‌తో `గోనగన్నారెడ్డి` సినిమా.. దర్శకుడు గుణశేఖర్‌ ఏం చెప్పారంటే?

`రుద్రమదేవి` చిత్రంలో అల్లు అర్జున్‌ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర ఎంతగా హైలైట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ పాత్ర ప్రధానంగా బన్నీతో `గోనగన్నారెడ్డి` చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ జరిగినట్టు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై దర్శకుడు గుణ శేఖర్‌ స్పందించారు.
 

gona ganna reddy movie with allu arjun director guna shekar react on this what he said?
Author
First Published Mar 22, 2023, 9:41 PM IST

దర్శకుడు గుణ శేఖర్‌ ఇప్పుడు మైథలాజికల్‌ మూవీ `శాకుంతలం`తో రాబోతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ స్టార్ట్ చేశారు. అయితే గుణశేఖర్‌ అంతకు ముందు `రుద్రమదేవి` చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వీఎఫ్‌ఎక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. దీంతో సోసోగానే ఆడింది. అంచనాలను అందుకోలేకపోయింది.

ఇందులో అల్లు అర్జున్‌ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర హైలైట్‌గా నిలిచింది. రుద్రమదేవి ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునే ఈ పాత్ర ఆకట్టుకుంది. రుద్రమదేవికి నెగటివ్‌గా కనిపిస్తూనే చివరికి అండగా నిలిచే పాత్రగా క్లైమాక్స్ లో వాహ్‌ అనిపించింది. మరోవైపు గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ ఇరగదీశాడు. ఆయన కనిపించినప్పుడల్లా సినిమాకి హై వస్తుంది. ఆ పాత్రలో రెచ్చిపోయి చేశాడు బన్నీ. అందుకే సినిమా మొత్తంలో ఆయన పాత్రనే హైలైట్‌గా నిలుస్తుంది. 

అయితే `రుద్రమదేవి` సినిమా విడుదల సమయంలో బన్నీ ఫ్యాన్స్ నుంచి `గోనగన్నారెడ్డి` సినిమా చేయాలనే డిమాండ్‌ వచ్చింది. దర్శకుడు గుణశేఖర్‌కి ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ లు వచ్చాయి. దీంతో దర్శకుడు `గోనగన్నా రెడ్డి` పాత్ర ప్రధానంగా ఆయన స్టోరీ నేపథ్యంలో సెపరేట్‌ సినిమా కూడా తీయాలనుకుంటున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్‌ డేట్ లేదు. 

తాజాగా ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు గుణశేఖర్‌ స్పందించారు. `శాకుంతలం` ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాపై ఆయన రియాక్ట్ అయ్యారు. క్లారిటీ ఇచ్చారు. అసలు తాను `గోనగన్నారెడ్డి` సినిమా చేయాలని అనుకోలేదని, అది కేవలం వదంతు మాత్రమే అని స్పష్టం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్‌తో `గోనగన్నారెడ్డి` సినిమా చేయాలనేది ఆయన ఫ్యాన్స్ డిమాండ్‌ మాత్రమే అన్నారు. కానీ `రుద్రమదేవి` సినిమాలోనే బన్నీ, తాను కూర్చొని ఆ పాత్రని ఎంతగా వాడుకోవాలో వాడేశామని, ఉన్నదానికంటే కాస్త ఎక్కువే చూపించామని, ఆ పాత్రకి సంబంధించి ఇంకా చెప్పడానికి ఏం లేదన్నారు. 

డిమాండ్‌ మేరకు సినిమా తీయాలని.. చరిత్రని వక్రీకరించి కథ పెంచి చేయకూడదు. ప్రాపర్‌ ఉన్న చరిత్రని తీసుకుని చేయాలి తప్పితే, కల్పితంతో చేయకూడదని వెల్లడించారు. అయితే `రుద్రమదేవి`లో బన్నీ పాత్ర క్లిక్‌ అయ్యిందని, ఆయనతో ఇలాంటి ఓ పాత్రతో సినిమా చేయాలనే ఆలోచన తనకు లేదన్నారు. కానీ ఆసమయంలో ఇన్‌స్పైర్‌ అయిన కథలో `హిరణ్య కశ్యప` ఉందన్నారు. ఆ ప్రాజెక్ట్ పై దాదాపు మూడేళ్లు కూర్చున్నానని, కానీ కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్ పక్కకెళ్లిందని, చిన్న బడ్జెట్‌లో మోస్తారు సినిమా చేయాలనే ఆలోచన నుంచి `శాకుంతలం` పుట్టిందన్నారు. 

ఓ లవ్‌ స్టోరీతో సినిమా చేయాలనుకున్నప్పుడు పూరణాలన్నీ చదువుతున్నాను. ఆ సమయంలో శాకుంతల, దుష్యంతుల లవ్‌ స్టోరీ మంచి పాయింట్‌గా కనిపించిందని, వీరి కథలో మంచి లవ్‌, శృంగారం, కమర్షియాలిటీ, పోయెటిక్‌ నేచర్‌ ఉన్నాయని,పైగా మైథలాజికల్‌ మూవీ కావడంతో ఇది కొత్తగా ఉంటుందని `శాకుంతలం` స్టోరీని ఎంచుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా సీజీ వర్క్‌ ఫైనల్‌ ట్యూనింగ్‌లో ఉందని, 3డీ వర్క్ జరుగుతుందని, రిలీజ్‌ డైట్‌కి అన్నీ రెడీ అవుతాయని తెలిపారు. `రుద్రమదేవి` విషయంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వీఎఫ్‌ఎక్స్, త్రీడీ విషయంలో రాజీపడకుండా క్వాలిటీగా తెరకెక్కిస్తున్నామని, ఈ విషయంలో దిల్‌రాజు సపోర్ట్ మరువలేనిదన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల కాబోతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios