సౌత్ లో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శంకర్. ఇటీవల రోబో '2.0' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు ఈ దర్శకుడు. తన తదుపరి సినిమా కమల్ హాసన్ తో తీస్తున్నాడు.

భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ సినిమాల్లో సెట్ కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ శంకర్ సెట్ మొత్తాన్ని గోల్డ్ కలర్ తో నింపబోతున్నాడట. ఈ సెట్ మొత్తం బంగారు తళతళలతో ఉంటుందని తెలుస్తోంది. ఈ మెటీరియల్ మొత్తం చైనా నుండి దిగుమతి చేస్తున్నారట.

బంగారంతో నిర్మించిన సెట్ లా కనిపించడం కోసం మెటీరియల్ కోసం చైనా సంస్థలకు ఆర్డర్ ఇచ్చారట. ఇంతా చేస్తున్న ఈ సెట్ లో షూటింగ్ రెండు రోజులే నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో కీలక సన్నివేశాలను ఈ సెట్ లో చిత్రీకరించబోతున్నారు. అదీ శంకర్ ప్లాన్.