‘గాడ్జిల్లా’ మళ్లీ వచ్చేస్తోంది. గతంలో చేసిన బీభత్సం చాలదన్నట్లు ఈ సారి మరింత భారీగా, మరింత భీకరంగా బీభత్సం సృష్టించేందుకు సర్వం సిద్దం చేసుకుంది. 2014లో వచ్చిన ‘గాడ్జిల్లా’కు మరోసారి రూపు రేఖలు మార్చుకుని ‘గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్’గా థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తే ..వ్యూస్ సంచలనంగా మారాయి.   ఈ నేపధ్యంలో తెలుగు వెర్షన్ ట్రైలర్ ని సైతం విడుదల చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

‘గాడ్జిల్లా’ సీరీస్‌లో వస్తున్న 35వ చిత్రం ఇది కావటం విశేషం. 2014లో విడుదలైన ‘గాడ్జిల్లా’ను 160 మిలియన్ డాలర్లతో నిర్మించగా..  529.1 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది.  ఇప్పుడీ చిత్రాన్ని సుమారు 200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రానికి మైఖెల్‌  డోగెర్టి డైరక్ట్ చేసారు. గత ‘గాడ్జిల్లా’ సినిమాలతో పోల్చితే ఇది మరింత భయానకంగా  కనిపిస్తోంది. ఈ   మే 31న ఈ సినిమా విడుదల కాబోతోంది.