మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నారు. ఆయన ఖాతాలో ఉన్న సినిమాల్లో గాడ్ ఫాదర్ కూడా ఒకటి. ఈ మూవీ షూటింగ్ ఆయన లేకుండానే నడుస్తోంది. ఇక రీసెంట్ గా సెట్ లో అడుగు పెట్టారు స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతార(Nayanthara).  

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నారు. ఆయన ఖాతాలో ఉన్న సినిమాల్లో గాడ్ ఫాదర్ కూడా ఒకటి. ఈ మూవీ షూటింగ్ ఆయన లేకుండానే నడుస్తోంది. ఇక రీసెంట్ గా సెట్ లో అడుగు పెట్టారు స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతార(Nayanthara).

గాడ్ ఫాదర్(Godfather Shooting) షూటింగ్ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఈ సినిమా కోసం గతంలోనే నయనతార (Nayanthara)ను అడిగారు టీమ్. ఇందులో ఆమెను హీరోకి చెల్లెలి పాత్ర కోసం సంప్రదించారు. అయితే ఈ విషయంలో నిర్ణంయం చెప్పడానికి ఆమె బాగా ఆలోచించినట్టు తెలిసింది. దానికి కారణం కూడా లేకపోలేదు.

మెగాస్టార్(Megastar Chiranjeevi) తో ఇంతకు ముందు సైరా సినిమాలో నటించింది నయన్. అయితే ఈమూవీలో తన పాత్ర నిడివిని చాలా వరకూ తగ్గించారట. ఈ విషయంలో గట్టిగానే హర్ట్ అయిన హీరోయిన్ అలిగిందట. దాంతె ఈ సినిమా నయన్(Nayanthara) చేయకపోవచ్చనీ రూమర్స్ గట్టిగా వినిపించాయి. అందులోనూ..చెల్లెలి పాత్ర కావడంతో ఒప్పుకోకపోవచ్చని అంతా అనుకున్నారు.

కానీ ఈసినిమాలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగు రీసెంట్ గా మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుగుతోంది. రీసెంట్ గానే ఈమూవీ షూటింగ్ లో నయనతార (Nayanthara) జాయిన్ అయినట్టు తెలుస్తంది.

అయితే కరోనా బారినపడిన కారణంగా చిరంజీవి(Megastar Chiranjeevi) ఈ షెడ్యూల్లో ఇంకా జాయిన్ కాలేదు. ప్రస్తుతం నయనతారకి సంబంధించిన సన్నివేశాలను మాత్రమే షూట్ చేస్తున్నారట టీమ్. ఇక్కడే మరో పది రోజుల పాటు ఆమెకి సంబంధించిన షూటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ లో నయనతార (Nayanthara) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఆమె క్రేజ్ కూడా అంతే రేంజ్ లో పెరుగుతూ వస్తోంది. తమిళం లో మాత్రమే కాదు ఇటు తెలుగులో కూడా నయనతారకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ ఫామ్ లో ఉంది నయనతార. ఈ మధ్య సొంత ప్రొడక్షన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆమె మరింత బిజీ అయ్యారు.