ఇప్పటికే టీజర్‌, ఓ సాంగ్‌ విడుదలై ఆకట్టుకున్నాయి. సల్మాన్‌ ఖాన్‌తో కలిసి స్టెప్పేసిన `తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌` పాట ఊపేసింది. ఇప్పుడు మరో పాటని విడుదల చేశారు.

మెగాస్టార్‌ చిరంజీవి చాలా గ్యాప్‌ తర్వాత సరైన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. `గాడ్‌ ఫాదర్‌` చిత్రం మెగా ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ చిరు ట్రీట్ లా ఉండబోతుంది. ఇది రీమేక్‌ సినిమా అయిన చిరు మార్క్ అంశాలతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. అంతేకాదు అభిమానులు ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి దాన్ని రీచ్ అయ్యేలా సినిమా ఉంటుందని చిరంజీవి కూడా చెప్పారు. 

ఈ సినిమా అక్టోబర్‌ 5న దసరా కానుకగా విడుదల కానుంది. అభిమానులకు విజయదశమి ట్రీట్‌ ఇవ్వబోతున్నారు చిరు. దీంతో సినిమా ప్రమోషన్‌ జోరు పెంచారు. ఇప్పటికే టీజర్‌, ఓ సాంగ్‌ విడుదలై ఆకట్టుకున్నాయి. సల్మాన్‌ ఖాన్‌తో కలిసి స్టెప్పేసిన `తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌` పాట ఊపేసింది. ఇప్పుడు మరో పాటని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం `గాడ్‌ ఫాదర్‌`లోని రెండో పాట `నజభజ జజరా.. `అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోని రిలీజ్‌ చేశారు. 

ఇందులో చిరంజీవి ఫైట్‌ సీన్‌ని హైలైట్‌గా చూపించారు. ఆయన హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ ఈ పాట సాగడం విశేషం. సినిమాలో కథలో భాగంగా ఈ పాట వస్తుందని అనిపిస్తుంది. చిరు మార్క్ మాస్‌ ఎలిమెంట్లు ఇందులో ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా ఇలా ఉంటే దసరాకి రచ్చ రచ్చే అంటున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ పాటని శ్రీ కృష్ణ, పృథ్వీ చంద్ర ఆలపించగా, అనంత శ్రీరామ్‌రాశారు. థమన్‌ సంగీతం సమకూర్చారు. టీజర్‌, మొదటి సాంగ్‌లపై కాపీ అనే విమర్శలు వచ్చినా, ఈ పాట మాత్రం కాస్త ఫ్రెష్‌గానే థమన్‌ కంపోజ్‌ చేయడం విశేషం.

YouTube video player

 ఇక ఈ చిత్రానికి సంబంధించిన వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్‌ చేసింది యూనిట్‌. రేపు బుధవారం(సెప్టెంబర్‌ 28)న భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. అనంతపూరంలోని ఆర్ట్స్ కాలేజ్‌ గ్రౌండ్‌లో ఈ భారీ ఈవెంట్‌ జరగబోతుంది. మరి ఈ ఈవెంట్‌ కి గెస్ట్ ఎవరనేది తెలియాల్సి ఉంది. పవన్‌ కళ్యాణ్‌ వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు రివీల్‌ చేయలేదు. దీంతో సస్పెన్స్ నెలకొంది. 

ఇక మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న `గాడ్‌ ఫాదర్‌`లో సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య పాత్ర పోషించగా, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, మలయాళంలోనూ విడుదల కాబోతుంది.