”ఒక సినిమా వంద కోట్లు వసూలు చేస్తే.. అందులో 50 కోట్లు హీరోలే దొబ్బేస్తున్నారు. అదే తెలుగులో అయితే ఎంత పెద్ద స్టార్ అయినా రూ. 15 కోట్లిచ్చినా తీసుకుంటారు.. ఈ అడ్జస్ట్ మెంట్ తమిళ్ ఇండస్ట్రీలో ఎందుకు లేదు” అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా. బన్నీ మూవీ ‘నా పేరు సూర్య’ తమిళ్ వెర్షన్ ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో ఒక ప్రెస్‌మీట్ జరిగింది. అక్కడ ఇలా కడుపు చించుకున్న జ్ఞానవేల్ రాజా.. టాలీవుడ్, కోలీవుడ్ హీరోల స్వభావాల మధ్య తేడాను విప్పి చెప్పేశారు.

తమిళ ఇండస్ట్రీలో నిర్మాతలకి, హీరోలకీ మధ్య కూడా కెమిస్ట్రీ ఎప్పుడు కలవదన్నది రాజా ఎక్స్‌ప్రెస్ చేసిన మరో ఒపీనియన్. తెలుగు హీరోల్లాగే తమిళ్ హీరోలు కూడా దారికి రాకపోతే.. తాను పూర్తిగా టాలీవుడ్‌కి వెళ్ళిపోడానికి రెడీగా వున్నానంటూ హెచ్చరించారు. ఇప్పటికే.. తనకు హైదరాబాద్‌లో ఆఫీసు ఉందని.. ఇంకా తమిళ్ సినిమాలు తీసి చేతులు కాల్చుకోడానికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పారాయన. తెలుగు సినిమాలు రిచ్‌గా వుంటాయని, అందుకే వాటికి నార్తిండియాలో మంచి మార్కెట్ ఉంటుందని భాష్యం చెబుతున్నారు.