ఇదో  సూపర్ నాచురల్ హారర్ మూవీ. య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెర‌కెక్కుతోన్న ఈ హారర్ మూవీ  కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చ్ ఫాథర్ జీవితం నేపథ్యంలో  ..


అనుష్క ది పాన్ ఇండియా మార్కెట్. ఆమెకు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే ఆమె వరస పెట్టి సినిమాలు చేయటం లేదు. చాలా సెలక్టివ్ గా వెళ్తోంది. త్వరలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయ్యింది. ఈ సినిమాతో స్వీటీ అనుష్క శెట్టి మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఫ‌స్ట్ టైమ్ ఓ మ‌ల‌యాళ మూవీ చేస్తుంది. ఫాంటసీ హారర్ డ్రామా కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ టైటిల్ రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ ఇంట్రనేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి.

YouTube video player

హీరో జయసూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక కథనార్ రెండు నిమిషాల నిడివి గల ‘గ్లింప్స్’ను బట్టి చూస్తే జయసూర్యను చర్చి అధికారుల ఖైదీగా చూపుతున్నట్టు కనిపిస్తోంది. 

జయసూర్య తమ చర్చిని నాశనం చేసే కొన్ని దుష్ట శక్తులను కలిగి ఉన్నాడని వారు నమ్ముతారు. మరోపక్క గ్రామస్తులు వ్యాధితో బాధపడుతున్నట్లు చూపించారు. టీజర్‌లో స్పూకీ వైబ్ ఉంది ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టీజర్‌కు ఆకట్టుకునేలా చేసింది. మేకర్స్ చివర్లో R రామానంద్ రాసిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయబడుతుందని, అందులో ఒకటి 2024లో విడుదల కానుందని వెల్లడించారు. 

 ఇదో సూపర్ నాచురల్ హారర్ మూవీ. య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెర‌కెక్కుతోన్న ఈ హారర్ మూవీ కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చ్ ఫాథర్ జీవితం నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. ఇందులో అనుష్క క్యారెక్టర్ అరుంధతి తరహాలో ఛాలెంజింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తం పదిహేను భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు

ఇక ఈ సినిమా పాన్ ఇండియన్ ఐదు భాషలతో కలిపి మొత్తం 14 భాషల్లో రిలీజ్ కానుంది. ఇక వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ఇండియన్ మూవీ ఇదే. అయితే టీజర్ లో ఎక్కడా అనుష్కని చూపించలేదు. అయితే మాత్రం ఈ సినిమాలో అనుష్క శెట్టి భాగం కావడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.