Asianet News TeluguAsianet News Telugu

మంచు ఫ్యామిలీ సినిమాలు మానేయడం బెటర్... మరీ వంద టికెట్స్ ఏంటి సామీ!

మంచు ఫ్యామిలీ సినిమాలు మానేయడం బెటర్. అసలు మినిమమ్ వసూళ్లు కూడా కష్టం అవుతున్నాయి. పోస్టర్స్ ఖర్చు కూడా రానప్పుడు సినిమాలు చేయడం అనవసరం. జిన్నా మూవీతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. 
 

ginna movie turns another disaster for manchu vishnu
Author
First Published Oct 24, 2022, 9:58 AM IST

ముక్కు ముఖం తెలియని ఒక కొత్త హీరో మూవీకి కూడా కనీస వసూళ్లు వస్తాయి. టాక్ తో సంబంధం లేకుండా ఎంతో కొంత రాబడుతుంది. మంచు ఫ్యామిలీ సినిమా అంటే మాత్రం జనాలు బాబోయ్ అంటున్నారు. వాళ్ళ సినిమాలు ఆడుతున్న థియేటర్స్ వైపు వెళ్ళడానికి బయపడుతున్నారు. మంచు వారి సినిమానా.. మా కొద్దు అంటూ పక్కన పెట్టేస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ఆల్ టైం డిజాస్టర్ మోహన్ బాబు నమోదు చేశాడు. పోస్టర్ ఖర్చులు, పార్కింగ్ చార్జీలు కూడా సన్ ఆఫ్ ఇండియా సినిమాకు రాలేదు. 

ఇప్పుడు తండ్రి సన్ ఆఫ్ ఇండియాతో క్రియేట్ చేసిన రికార్డ్స్ కొడుకు మంచు విష్ణు జిన్నాతో బ్రేక్ చేస్తున్నాడు. కనీసం రూ. 50 లక్షల షేర్ జిన్నా సినిమాకు రాలేదు.  దీపావళికి నాలుగు సినిమాలు విడుదల కాగా జిన్నా అతి తక్కువ వసూళ్లు నమోదు చేసింది. డీసెంట్ టాక్  వచ్చినప్పటికీ ఫలితం మాత్రం రిపీట్ అయ్యింది. కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ లేదు. జనాలు లేక రెండో రోజే షోస్ రద్దు అయ్యాయి. ఇక యూఎస్ లో కేవలం 100 టికెట్స్ అమ్ముడుపోయాయి. రూ. 1.25 లక్షలు వసూలు చేసింది. 

జిన్నా సినిమా తక్కువలో తక్కువ రూ. 4 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే పదో వంతు వసూళ్లు కూడా రాలేదు. మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలు జనాలు ఇంతగా అవైడ్ చేయడానికి కారణం ఏమిటో తెలియడం లేదు. కనుమరుగైపోయిన హీరోలు చిత్రాలు చేసినా ఇంత కంటే మెరుగైన వసూళ్లు వస్తాయి. పండుగ సందర్భంగా విడుదలైనప్పటికీ కనీస ఆదరణ దక్కలేదు. మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ నటించారని తెలిస్తే ఆ సినిమా బాగోదని ఫిక్సయిపోతున్నారు. వాళ్ళను నటులుగా, హీరోలుగా గుర్తించడం లేదు. 

మోసగాళ్లు సినిమాతో మంచు విష్ణు భారీగా నష్టపోయాడు. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి వంటి స్టార్ క్యాస్ట్ తో అధిక బడ్జెట్ పెట్టి మోసగాళ్లు తెరకెక్కించారు. సినిమా ఫలితం మాత్రం సేమ్. మోసగాళ్లు రిజల్ట్ చూశాక మనోజ్ ప్రకటించిన పాన్ ఇండియా మూవీ అహం బ్రహ్మస్మి నిర్మించే సాహసం ఆ ఫ్యామిలీ చేయడం లేదు. ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టిన మనోజ్ మరో అప్డేట్ ఇవ్వలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అహం బ్రహ్మస్మి కార్యరూపం దాల్చడం కష్టమే. ఈ స్థాయిలో ఒక ఫ్యామిలీని ఆడియన్స్ దూరం పెట్టడం బహుశా ఎక్కడా చూడలేం. మరోవైపు తమ చిత్రాలను కుట్ర పూరితంగా దెబ్బతీస్తున్నారని మోహన్ బాబు, విష్ణు ఆరోపణలు చేస్తున్నారు. సినిమా నచ్చితే, హీరో పట్ల ఆసక్తి ఉంటే ఎవరు ఆపినా ఎంత దుష్ప్రచారం చేసిన ప్రేక్షకులు చూస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios