Rs.5 Tiffin scheme: హైదరాబాద్ నగరవాసులకు ఓ శుభవార్త. జీహెచ్‌ఎంసీ త్వరలో కేవలం 5 రూపాయాలకే టిఫిన్ అందించే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటివి అందుబాటులో ఉంటాయి.
Rs.5 Tiffin scheme : హైదరాబాద్ నగరవాసులకు ఓ శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం పేదలు, రోజు వారీ కూలీలు, చిన్న వ్యాపారుల ఆకలి తీర్చేందుకే ఓ అద్బుత పథకంతో ముందుకు రాబోతుంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా పేదలు, రోజువారీ కూలీల కేవలం రూ.5 లకే టిఫిన్ అందించాలని భావిస్తోంది. మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలు..
ప్రతి రోజూ 25 వేల మందికి
గ్రేటర్ హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు జరుగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే టిఫిన్ పథకం ప్రారంభించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మొత్తం 150 కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కానీ, మొదటి దశలో 60 కేంద్రాల్లో పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రతిరోజూ సుమారు 25,000 మంది పేదలు, రోజు వారీ కూలీలు, చిన్న వ్యాపారులు, నగరానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు భోజనం అందించనున్నారు.
కేవలం రూ. 5 లకే
ఈ టిఫిన్ పథకం ద్వారా ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ వంటి అల్పాహారాలు అందించనున్నారు. ఒక్కో ప్లేట్ ధర కేవలం రూ. 5 మాత్రమే. అయితే.. ఒక్కో ప్లేట్ తయారీకి ₹19 ఖర్చు అవుతుంది. వీటిలో వినియోగదారులు ₹5 చెల్లిస్తారు, మిగిలిన ₹14 జీహెచ్ఎంసీ భరిస్తుందట. ఇవి వారంలో ఆరు రోజులు తెరిచి ఉంటాయి. ఆదివారం సెలవు. వాస్తవానికి ఆగస్టు 15 ననే ఇందిరమ్మ క్యాంటీన్లను తెరవాలని భావించారు. కానీ, అది సాధ్యం కాలేదు.
అన్నపూర్ణ కార్యక్రమం
ఇదిలా ఉంటే పేద ప్రజలకు తక్కువ ధరకే మంచి భోజనం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో రూ.5కే భోజనం అందించాలని అన్నపూర్ణ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పట్లో నాంపల్లి రైల్వే స్టేషన్‌లో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నాయి. నగరంలోని పేదలు, కూలీలు, వివిధ పనుల మీద నగరానికి వచ్చేవారికి తక్కువ ధరలో భోజనం అందించాలనేది లక్ష్యం.
పేదలకు తక్కువ ధరకే భోజనం అందించారు. ఇప్పుడు నగరంలోని 150 కేంద్రాల్లో ప్రతిరోజూ సుమారు 30 వేల మంది భోజనం పొందుతున్నారు. ప్రస్తుతం 128 కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా కేంద్రాలు మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
మోను ఇదే..
కేవలం 5 రూపాలయలకే అందించే భోజనంలో 400 గ్రాముల అన్నం , 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల సబ్జీ, 15 గ్రాముల పచ్చడి అందిస్తున్నారు. ఒక్కో ప్లేటు భోజనానికి రూ.27.63 ఖర్చు అవుతుంది. దీనిలో లబ్ధిదారులు రూ.5 చెల్లిస్తుండగా, మిగిలిన రూ.24.83లను జీహెచ్ఎంజీ భరిస్తుంది. ఈ పథకం కోసంజీహెచ్ ఎంసీ ప్రతి సంవత్సరం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తోందట. ఇప్పడు రూ.5కే భోజనం కార్యక్రమం మాదిరే టిఫిన్ పథకాన్ని ప్లాన్ చేశారు.
