ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ షాకిచ్చింది. ఇంటికి ఎల్‌ఈడీ లైట్లతో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌పై భారీ జరిమానా విధించింది. దాదాపు లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మోహన్ బాబు ఈ బోర్డును ఏర్పాటు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.