దివంగత సంగీత దర్శకుడు ఘంటసాల జీవిత చరిత్రతో 'ఘంటసాల ది గ్రేట్' అనే బయోపిక్ ని రూపొందించారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

తమ అనుమతి లేకుండా సినిమా ఎలా తీస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఘంటసాల తనయుడు ప్రముఖ కళాకారుడు ఘంటసాల రత్నకుమార్ మాట్లాడుతూ.. ''నాన్న గారి పేరుతో 'ఘంటసాల ది గ్రేట్' సినిమా తీశామని ప్రకటించారు. ఎవరిని అడిగి ఈ బయోపిక్ తీశారు..? ఆ బయోపిక్ కి మా అనుమతి కానీ సపోర్ట్ కానీ లేదు.
ఎవరికి వాళ్లు ఘంటసాల జీవితంపై సినిమా చేసుకుంటూపోతే.. కుటుంబ సభ్యుల మనోభావాల సంగతేంటి..? మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. స్క్రిప్ట్ మాకు చూపించి మా అంగీకారంతో సినిమా తీయాలే తప్ప ఇలా అనుమతి లేకుండా సినిమా చేయడం కరెక్ట్ కాదు. 'ఘంటసాల ది గ్రేట్' చిత్రబృందం మమ్మల్ని సంప్రదించలేదు. మా పర్మిషన్ తీసుకోలేదు..
దీనిపై లీగల్ గా యాక్షన్ తీసుకోబోతున్నాం. గతంలో కూడా నాన్న గారి పేరుతో సీరియళ్లు తీశారు. ఎవరి ఇష్టానుసారం వారు చేస్తున్నారు. ఇకపై అలా జరగకూడదనే చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు.