తెలుగు చిత్ర పరిశ్రమ అప్పుడే చిన్ని చిన్ని అడుగులు వేస్తూ అభివృద్ధి చెందుతున్న సమయంలో తన పాటతో ప్రపంచాన్ని సైతం ఆకర్షించిన గాన గంధర్వుడు ఘంటసాల గారు. వరుసగా బయోపిక్ లు తెరపైకి వస్తున్న సమయంలో ఆయన బయోపిక్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. 

2 నిమిషాల 17 సెకన్ల నిడివిగల ఈ టీజర్ లో బాలీవుడ్ ప్రముఖుల బయోపిక్ లతో పాటు మహానటి సావిత్రి బయోపిక్ ను కూడా చూపించారు. అదే తరహాలో ఇప్పుడు ఘంటసాల జీవిత ఆధారంగా సినిమా రానుందని బాగానే చెప్పారు. అయితే అంత గొప్ప మహా సంగీత దర్శకుడి జీవితాన్ని ఎక్కువగా శ్రద్ధ పెట్టకుండా తెరక్కించారా అనే అనుమానం కలుగుతోంది. 

ఘంటసాల క్యారెక్టర్ లో గాయకుడు కృష్ణ చైతన్య నటించాడు. ఘంటసాల అప్పట్లో కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో తన గాత్రాన్ని వినిపించారు. అందుకు సంబందించిన సన్నివేశాలను కవర్ చేయడానికి ప్రయత్నం చేశారు గాని ఆ సీన్స్ ను చూస్తుంటే అందరికి ఒక ఆలోచన వచ్చే ఉంటుంది. ఇతర కార్యక్రమాల సీన్స్ ను కట్ చేసి యాడ్ చేసినట్లుగా ఉంది. 

అసలే ఘంటసాల కుటుంబ సభ్యులు ఈ బయోపిక్ ని ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా సినిమాను తెరక్కించారంటూ ఘంటసాల ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుకెక్కడానికి సిద్ధమయ్యారు. అలాంటిది ఇప్పుడు సినిమా టీజర్ ను ఇలా చూపించడంతో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అనే అనుమానం కలుగుతోంది. 

మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.  సిహెచ్.రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మి నీరజగారు నిర్మించారు.