బుల్లితెర యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని రష్మి, సుధీర్ చెబుతూనే ఉన్నారు.

వారు ఎంతగా చెప్పినా ఈ రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఈ విషయంపై తాజాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను స్పందిస్తూ.. రష్మి, సుధీర్ ల మధ్య ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసాడు. ఇద్దరూకలిసి వృత్తి పరంగా షోలు చేయడం తప్ప, వ్యక్తిగతంగా వారిమధ్య ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

మరిన్ని విషయాలు చెబుతూ.. ''రష్మి ఆమె షూటింగ్ లు, ఫ్యామిలీ వ్యవహారాలతో చాలా బిజీగా ఉంటారు. సుధీర్ తనకు ఫ్రెండ్ మాత్రమే. మేము కూడా అంతే.. రష్మి మంచి వ్యక్తి, ఆమెని మా కుటుంబంలో అమ్మాయిగా చూస్తాం. సుధీర్, రష్మి ల మధ్య చిన్న ట్రాక్ పెట్టి కామెడీ చేద్దామని మొదలుపెడితే అది కాస్త వారి వ్యక్తిగత జీవితాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. రష్మి దీని గురించి పెర్సనల్ గా నాకేం చెప్పలేదు కానీ సుధీర్ ఫ్యామిలీ అయితే చాలా బాధ పడుతుంటారు.

సుధీర్ కి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే.. రష్మి టాపిక్ తెస్తున్నారు. అలా అడిగితే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా.. సుధీర్, రష్మి కనీసం నెలకి ఒకసారి కూడా ఫోన్ చేసుకోరు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఇలాంటి రూమర్లు రావడంతో రష్మి  ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫీల్ అయ్యారు. దయచేసి వారిద్దరి మధ్య ఏదో ఉందని ఊహించుకోకండి'' అంటూ చెప్పుకొచ్చాడు.