రాజకీయాల్లోకి హీరోయిన్ భర్త!

First Published 11, Jul 2018, 4:39 PM IST
Genelia's Husband Ritesh To Enter Politics
Highlights

గతేడాదిలో రితేష్ ను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం తనకు అటువంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసిన ఈ నటుడు ఇప్పుడు మాత్రం లోక్ సభ ఎన్నికల్లో పాల్గోనున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు రితేష్ ఎలాంటి కామెంట్ చేయలేదు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడైన రితేష్ దేశ్ ముఖ్ నటుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు 'టోటల్ ధమాల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే తన తండ్రి రెండు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల వలన ఆయన 2012లో మరణించారు. అదే ఏడాదిలో రితేష్ నటి జెనీలియాను వివాహం చేసుకున్నారు.

ఆ తరువాత సినిమాలలోనే నటిగా కెరీర్ సాగించిన రితేష్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో రితేష్ ను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం తనకు అటువంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసిన ఈ నటుడు ఇప్పుడు మాత్రం లోక్ సభ ఎన్నికల్లో పాల్గోనున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు రితేష్ ఎలాంటి కామెంట్ చేయలేదు.

కానీ ఆయన పోటీ చేయడం ఖాయమని అందుకే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే 2019 ఎన్నికల్లో సెలబ్రిటీల హవా ఎక్కువయ్యేలా ఉందనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రజినీకాంత్, కమల్ హాసన్, ఉపేంద్ర వంటి నటులు ఎన్నికలో బరిలో దిగడానికి సిద్ధమవుతుంటే ఇప్పుడు రితేష్ కూడా ఆ లిస్టులో జాయిన్ అయ్యాడు.  

loader