Asianet News TeluguAsianet News Telugu

కాటమ రాయుడు శాటిలైట్ హక్కులు ఎంతో తెలుసా

  • కాటమ రాయుడు మూవీ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమినీ
  • 12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన  జెమిని టీవీ

 

gemini tv bags katama rayudu sattellite rights

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో కిషోర్ పార్థసాని(డాలీ) ద‌ర్శ‌క‌త్వంలో నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా మార్చి 24న విడుద‌ల కానుంది. సినిమా ప్ర‌స్తుతం విదేశాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

 

 

సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను మార్చి 18న గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ పోటీ నెల‌కొంది. జెమిని టీవీ దాదాపు ప‌న్నెండున్న‌ర కోట్ల రూపాయ‌లు చెల్లించి శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios