Asianet News TeluguAsianet News Telugu

బయటపడ్డ గీతూ రాయల్‌ మోసం.. తనని వదిలేసిన శ్రీహాన్‌నే ముంచేసిందిగా!

బుధవారం షోలో సిసింద్రీ ఆటనే కొనసాగింది. రాత్రి రెండు గంటల సమయంలో కంటెస్టెంట్లు ఇతరుల బేబీలను కొట్టేసి డిస్ క్వాలిఫై అయ్యే చోటు చైర్‌లో పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. 
 

geetu royal cheating open srihan booked by her intresting bb6 11th day episode
Author
First Published Sep 14, 2022, 11:41 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ కాస్త రంజుగా మరికాస్త చప్పగా సాగుతుంది. బుధవారం గేమ్‌లో ఆశించిన మసాలా లేదు. ఫైటింగ్‌లు తగ్గడంతో ఎపిసోడ్ రక్తికట్టలేకపోయింది. అయితే ఉన్నంతలో రాత్రి సమయంలో బేబీలను దొంగిలించేందుకు కంటెస్టెంట్లు చేసిన ప్రయత్నాలు మాత్రం కాస్త మాసాలాని జోడించాయి. మరి ఆ సంగతులేంటో చూస్తే.. 

బిగ్‌ బాస్‌ తెలుగు 6.. పదకొండో రోజుకి చేరుకుంది. మొదటి రోజు కౌంట్ లేకపోవడంతో పదో రోజుగానే పరిగణిస్తారనే విషయం తెలిసిందే. ఇక పదో రోజు(బుధవారం) కూడా సిసింద్రీ టాస్కే కంటిన్యూ అయ్యింది. కెప్టెన్సీ పోటీ దారుల కోసం బిగ్‌ బాస్‌ ఈ టాస్క్ ని ఇచ్చిన విషయం తెలిసిందే. బుధవారం షోలో సిసింద్రీ ఆటనే కొనసాగింది. రాత్రి రెండు గంటల సమయంలో కంటెస్టెంట్లు ఇతరుల బేబీలను కొట్టేసి డిస్ క్వాలిఫై అయ్యే చోటు చైర్‌లో పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. 

ఇందులో ఇతర కంటెస్టెంట్  నిద్ర పోతున్న సమయాన్ని చేసి, చాటుగా బేబీలను కొట్టేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రతి కంటెస్టెంట్‌ తన బేబీని తమ దగ్గరే దాచుకోవాలని బిగ్‌ బాస్‌ చెప్పిన నేపథ్యంలో అందరు తమ వద్ద దాచుకున్నారు. అర్థరాత్రి మూడు గంటల సమయంలో శ్రీహాన్‌ ఈ దొంగతనం ప్రోగ్రాం పెట్టుకున్నారు. అర్జున్‌ కళ్యాణ్‌ వద్ద ఉన్న బొమ్మని కొట్టేశారు. ఆదిరెడ్డి బొమ్మ తలని తీసేశారు. ఈ క్రమంలో అర్జున్‌ కళ్యాణ్‌, శ్రీహాన్‌ల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. 

అనంతరం గీతూ రాయల్‌ బేబీని కొట్టేసేందుకు ప్రయత్నించాడు శ్రీహాన్‌. ఆమె నిద్ర పోగా దుప్పటి లేపి మరీ ఆ బొమ్మని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె బేబీని టీ షర్ట్ లో దాచుకోవడంతో ఏం చేయలేక సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఇతర కంటెస్టెంట్ల వద్దకి కూడా వెళ్లి చూశాడు కానీ ఏదీ వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత కాసేపటికే శ్రీహాన్‌ నిద్రపోయాడు. అనంతరం గీతూ రాయల్ విజృంభించింది. తనని వదిలేసిన శ్రీహాన్‌నే టార్గెట్‌ చేసింది. అతడి బెడ్‌ రూమ్‌ దగ్గరకు వెళ్లి బొమ్మని దొంగిలించింది. దాన్ని డిస్‌ క్వాలిఫై ఏరియాలో పెట్టేసింది. ఇలా తన గేమ్‌ స్ట్రాటజీ కోసం తన మోసం బయటపడింది. కానీ తాను ఇలానే ఆడుతానంటూ ఆమె చెప్పడం విశేషం. 

అనంతరం రింగ్‌ టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో పోటీలో పాల్గొనే సభ్యులు ఆ రింగ్‌లో పోరాడుతూ ఎదుటి వారిని రింగ్‌ లైన్‌ దాటేలా చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫైమా, కీర్తి, ఇనయ, ఆరోహి, అర్జున్‌ కళ్యాణ్‌ వంటి వారు పోటీపడ్డారు. ఫైమా పోరాడి ఓడిపోయింది. అర్జున్‌ కళ్యాణ్‌ సైతం అమ్మాయిల దాటికి తట్టుకోలేకపోయాడు. చివరగా ఇనయ, కీర్తి పోరాడగా, ఇనయ గెలిచింది. అయితే ఈక్రమంలో కీర్తి భట్‌ కి కడుపులో నొప్పి రావడం అందరిని షాక్ కి గురి చేసింది. కాసేపు హౌజ్‌లో టెన్షన్‌ వాతావరణం క్రియేట్‌ అయ్యింది. 

అనంతరం కోన్స్ సరైన విధంగా పెట్టే టాస్క్ లో రాజశేఖర్‌, ఆర్జే సూర్య విజయం సాధించారు. దీంతో మొత్తంగా నలుగురు కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్నారు. వారిలో చంటి, ఇనయ, రాజశేఖర్‌, ఆర్జే సూర్య ఉన్నారు. రేపు వీరు కెప్టెన్సీ కోసం పోటీ పడబోతున్నారు. వీరిలో విన్నర్‌ ఎవరనేది ఆసక్తిగా మారింది. అంతటితో సిసింద్రీ గేమ్‌ ముగిసింది. తమకిచ్చిన బేబీలను వెనక్కి తిరిగిచ్చారు. ఈ సందర్భంగా కొందరు ఎమోషనల్‌ అయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios