`గీతా సుబ్రమణ్యం 3` వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్
`ఆహా`లో స్ట్రీమింగ్ అవుతున్న `గీతా సుబ్రమణ్యం` వెబ్ సిరీస్ విశేష ఆదరణ పొందుతుంది. ఇప్పటికే రెండు సిరీస్‌లు వచ్చి మెప్పించారు. ఈ శుక్రవారం మూడో సిరీస్ వచ్చింది. మరి ఇది వాటిని మించి ఉందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లు ట్రెండ్‌లాగా వస్తున్నాయి. బాగా ఆదరణ పొందుతున్నాయి. సినిమాని మించిన స్థాయిలో వెబ్ సిరీస్‌లు రూపొందుతుండటం విశేషం. వీటికి విశేష ఆదరణ లభిస్తుంది. అందులో బాగా ఆదరణ పొందుతున్న సిరీస్ `గీతా సుబ్రమణ్యం`. లవ్ అండ్ రిలేషన్‌షిప్ ఆధారంగా నేటి కల్చర్‌ని ప్రతిబించేలా రూపొందుతున్న ఈ సిరీస్ `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే రెండు సిరీస్‌లు వచ్చి మెప్పించాయి. సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ `గీతా సుబ్రమణ్యం 3` వచ్చింది. ఇది శుక్రవారం నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతుంది. టమడ మీడియా నిర్మించిన ఈ సిరీస్‌ని శివ సాయి వర్థన్ దర్శకత్వం వహించారు. గీతా గా అభిజ్ఞ్య ఉతలూరు, సుబ్రమణ్యంగా సుప్రజ్ రంగా నటించారు. మరి గత సిరీస్‌లను మించి ఆకట్టుకునేలా ఉందా? లేక తేలిపోయిందా? అనేది చూద్దాం.
కథః
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఓ ప్రాజెక్ట్ నిమిత్తం గీతా(అభిజ్ఞ్య), సుబ్రమణ్యం(సుప్రజ్) జాబ్‌లో చేరతారు. వీరికి పురుష్ టీమ్ లీడర్. అయితే ఈ కంపెనీలో ఎంప్లాయిస్ లవ్‌లో పడకూడదు, రిలేషన్ షిప్స్ పెట్టుకోకూడదనే రూల్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే జాబ్ ఊడినట్టే. ఆ రూల్‌ని చదవక ఓ జంట రిజైన్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి రూల్ ఉందని తెలిసినా గీతా, సుబ్రమణ్యం లవ్ లో పడతారు. లివింగ్ రిలేషన్‌షిప్(సహజీవనం) చేస్తుంటారు. కానీ ఆఫీస్‌లో తెలియకుండా మ్యానేజ్ చేస్తుంటారు. ఇద్దరు కలిసి ఓకే ఫ్లాట్‌లో ఉంటూ మ్యానేజ్ చేస్తుంటారు. ఎంజాయ్, రొమాన్స్, చిన్న చిన్న గొడవలు, సారీ చెప్పుకోవడాలు, మళ్లీ కలిసిపోవడాలు కామన్‌గా జరుగుతాయి. ఆఫీస్‌లోనే కాదు, బయటకు కూడా తమ రిలేషన్‌షిప్‌ని హైడ్ చేస్తుంటాడు సుబ్రమణ్యం, ట్రిప్‌కి వెళ్లినప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కారణంగా సుబ్రమణ్యం విషయంలో హర్ట్ అవుతుంది గీతా. నిజంగానే అతను తనని లవ్ చేస్తున్నాడా? అనే అనుమానాలు కలుగుతుంటాయి. మరోవైపు ఆఫీస్‌లో ఓ లవ్ పెయిర్ ఉందనే సమాచారం టీమ్‌కి అందుతుంది. అదెవరో తేల్చుకునే టైమ్ వస్తుంది? మరి దీన్ని ఈ ఇద్దరు ఎలా మ్యానేజ్ చేశాడు? తమ లివింగ్ రిలేషన్‌షిప్ ఒప్పుకున్నారా? అనంతరం ఏం జరిగిందినేది ఈ వెబ్ సిరీస్ మిగిలిన స్టోరీ.
విశ్లేషణః
వెబ్ సిరీస్‌లు అంటే బూతులు, సెక్స్, వల్గారిటీ అనే కామెంట్లు తరచూ వినిపిస్తుంటాయి. ఇక్కడ సెన్సార్ లేకపోవడంతో చాలా వరకు ఎక్స్ పోజింగ్, సెక్స్, బోల్డ్ నెస్ కంటెంట్‌కి ప్రయారిటీ ఇస్తారనే కామెంట్లు, విమర్శలు చాలా వెబ్ సిరీస్‌ల విషయంలో వినిపిస్తుంటుంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన సిరీస్ `గీతా సుబ్రమణ్యం`. ఆహా సైతం తమ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో క్లీన్ కంటెంట్‌ని ఇస్తామని నిరూపిస్తున్నాయి. ఇప్పటికే క్లీన్ ఫ్యామిలీ సిరీస్‌గా రెండు భాగాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న మూడో సిరీస్ కూడా అంతే క్లీన్‌గా రూపొందించారు. ఎలాంటి భాష, కట్టుబొట్టు, కలిసి ఉండటం నుంచి అన్నీ చాలా క్లీన్‌గా ఉన్నాయి. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు ఛాన్స్ లేకుండా దీన్ని రూపొందించారు. పైగా గత రెండు సీజన్ల కంటే క్వాలిటీగానూ తెరకెక్కించడం విశేషం. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా నీట్‌గా ఈ సిరీస్ సాగుతుండటం విశేషం.
ప్రారంభం నుంచే దీనిపై ఆసక్తిని క్రియేట్ చేసేలా కథలోకి తీసుకెళ్తూ గీతా, సుబ్రమణ్యంల జర్నీని చూపించారు. వాళ్లు పైకి యాక్ట్ చేస్తూ, ఇంట్లో ఘాటు ప్రేమలో మునిగిపోవడం వంటి సీన్లని చాలా బాగా డిజైన్ చేశారు దర్శకుడు శివ సాయి వర్థన్. ఇందులో అమ్మాయి, అబ్బాయి మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థాలను చూపిస్తూనే అందులోనే వారి స్వచ్ఛమైన ప్రేమని ఆవిష్కరించారు. ఇందులోనే నేటి సిటీ కల్చర్ లివింగ్ రిలేషన్ షిప్స్ ని కళ్లకి కట్టినట్టు చూపించారు. అయితే దీనికి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇద్దరు ప్రేమించుకోవడం, రిలేషన్‌లో ఉండటం చేయకూడదనే కండీషన్‌ని డ్రామాని రక్తికట్టించడం కోసం వాడుకున్నారు దర్శకుడు. కథనాన్ని చాలా వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా నీట్‌గా సాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇందులో వినోదం లోపించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్ ఉంది, కానీ పెద్దగా ఛాన్స్ తీసుకోలేదనిపిస్తుంది. మరోవైపు పాత్రల డైలాగ్ డెలివరీ, పాత్రలు వ్యవహరించే తీరు కాస్త కంజెస్టెడ్‌గా ఉంది. ఏదో ఒక జోన్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. దీనికితోడు డ్రామాని ఇంకాస్త రక్తి కట్టిస్తే బాగుండేది. మ్యూజిక్, ఆర్‌ఆర్‌ఆర్, ఎడిటింగ్ పర్‌ఫెక్ట్ గా ఉంది. అక్కడక్కడ సన్నివేశాలను మరీ సాగదీసినట్టుగా అనిపించింది. వెబ్ సిరీస్ అంటే ఇలాంటిది కామనే అని కూడా చెప్పొచ్చు. అయితే క్లైమాక్స్ మాత్రం పీక్‌కి తీసుకెళ్లారు. అక్కడ తమ లవ్‌ని ఎక్స్ ప్రెస్ చేసుకుంటూ ఆడియెన్స్ గుండెల్ని బరువెక్కించారు. ఎమోషన్స్ మేళవింపుగా సాగే లవ్ ఫీల్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ఒక హై ఫీల్‌తో ముగింపు పలకడం బాగుంది. అయితే ఇందులో రెండో పార్ట్ `సుబ్రమణ్యం` తళుక్కున మెరవడం విశేషం. అయితే ఇది ఏ క్లాస్ ఆడియెన్స్ కి పరిమితమయ్యేలా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు.
ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పనితీరుః
నటీనటుల పరంగా గీతగా అభిజ్ఞ్య, సుబ్రమణ్యంగా సుప్రజ్ చాలా బాగా చేశారు. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. చిన్న చిన్న ఎమోషన్స్ ని, ఎక్స్ ప్రెషన్స్ ని సైతం చాలా బాగా పలికించారు. మెప్పించారు. సిరీస్ చివరి వరకు వెళ్లేసరికి వీళ్లే నిజమైన గీత, సుబ్రమణ్యం లు అనే ఫీలింగ్ తెప్పించారు. మిగిలిన పాత్రలు కూడా కాసేపు మెరిసినా ది బెస్ట్ ఇచ్చారు. టెక్నీకల్‌గా చాలా బాగుంది. పవన్ మ్యూజిక్, వినయ్ ఎడిటింగ్, శ్రీధర్ కేవీ కెమెరా వర్క్, టమడ మీడియా నిర్మాణ విలువలు, దర్శకుడి టేకింగ్ ఇలా అన్నీ బ్రిలియంట్. క్వాలిటీ కంటెంట్‌తో కూడిన సిరీస్ మాత్రమే కాదు, మెచ్యూర్డ్ వెబ్ సిరీస్ అని కూడా చెప్పొచ్చు.
రేటింగ్‌ః 3