ప్రస్తుతం బాలీవుడ్ హీరోలంతా సౌత్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. సౌత్ లో ఘనవిజయం సాధించిన చిత్రాలని బాలీవుడ్ లో రీమేక్ చేసుకుంటున్నారు. ఇటీవల తెలుగులో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనితో బాలీవుడ్ హీరోల దృష్టి తెలుగు సినిమాపై పడింది. 

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించాడు. కబీర్ సింగ్ కూడా బాలీవుడ్ ఘనవిజయంగా నిలిచింది. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. ఇషాన్ కూడా విజయ్ దేవరకొండ సూపర్ హిట్ చిత్రంపై మనసు పడ్డట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

గీత గోవిందం చిత్ర రీమేక్ హక్కులని ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఆయన కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారట. ఏ చిత్రంలో హీరో ఇషాన్ ఖట్టర్ అని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఈ క్రేజీ రీమేక్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.