విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన 'గీత గోవిందం' సినిమా ఆగస్టు 15న విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ క్రాస్ చేసి మిలియన్ డాలర్ క్లబ్ లోకి జాయిన్ కావడానికి సిద్ధమవుతోంది. మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 5.44 కోట్లు షేర్ వసూలు చేయగా రెండో రోజు 3.85 కోట్లు షేర్ వసూలు చేసింది.

మొదటిరోజుకి రెండో రోజుకి కలెక్షన్స్ డ్రాప్ అయినట్లుగా కనిపించినా ఈ వీకెండ్ నాటికి సినిమా భారీ వసూళ్లను సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈరోజు నైజాం ఏరియాలో 40 స్క్రీన్ లు అదనంగా పెంచినట్లు తెలుస్తోంది. ఇక ఏరియాల వారీగా సినిమా కలెక్షన్స్ చూద్దాం!

నైజాం            3.10 cr
సీడెడ్            1.60 cr
ఉత్తరాంధ్ర     1.00 cr
ఈస్ట్               0.81 cr
వెస్ట్               0.69 cr
కృష్ణ              0.79 cr
గుంటూరు      0.91 cr
నెల్లూరు         0.35 cr

మొత్తం వసూళ్లు 9.25 కోట్లు.. చిన్న సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. రెండో రోజు నుండే ఈ సినిమా నిర్మాతలకు లాభాలను మిగులుస్తుంది.