అమ్మాయిలు, ఫిగర్లు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా.. హీరోకి హీరోయిన్ వార్నింగ్

geetha govindam movie teaser talk
Highlights

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ' అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ లో కలలు కంటూ హీరోయిన్ కు ముద్దు పెడతాడు.. హీరోయిన్ చెంప దెబ్బ కొట్టడంతో రియాలిటీలోకి వస్తాడు. 

'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషనల్ హీరో అయిపోయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరో అయిపోయాడు. తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ హీరోగా తన ఎదుగుదలపై ఫోకస్ పెట్టాడు. అతడు నటించిన సినిమా విడుదలవుతుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం గీతాఆర్ట్స్ బ్యానర్ లో 'గీత గోవిందం' అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పోస్టర్లు, రీసెంట్ గా విడుదలైన పాటకు మంచి క్రేజ్ రావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ' అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ లో కలలు కంటూ హీరోయిన్ కు ముద్దు పెడతాడు.. హీరోయిన్ చెంప దెబ్బ కొట్టడంతో రియాలిటీలోకి వస్తాడు. ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా అంటూ హీరోయిన్ వార్నింగ్ ఇవ్వడం, నేను మారిపోయాను మేడమ్.. ఐ యామ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ.. అని విజయ్ దేవరకొండ చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా టీజర్ ఆసక్తికరంగా అనిపించింది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ రూపొందించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!


 

loader