నాన్ బాహుబలి రికార్డ్ 'గీత గోవిందం' సొంతం!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 1, Sep 2018, 11:12 AM IST
geetha govindam creates non bahubali record
Highlights

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించి తన సత్తా చాటింది.

ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఊహించని విధంగా ఘన విజయం అందుకున్న ఈ సినిమా సక్సెస్ ని చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి రికార్డును తమిళనాడులో బద్దలు కొట్టింది. అక్కడ రూ.5 కోట్ల గ్రాస్ తో దూసుకుపోతుంది.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించింది. సినిమాలో లీడ్ పెయిర్ నటనతో పాటు గోపి సుందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా మిగిలాయి. రాను రాను ఈ సినిమా మరెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి!
 

loader