56 కోట్ల రూపాయలకు పైగా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం క్రిష్ దర్శకత్వంలో నటించిన చారిత్రాత్మక చిత్రం ''గౌతమిపుత్ర శాతకర్ణి ''. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టెయిన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి ,వై . రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు . బాలయ్య సరసన శ్రియా శరన్ నటించగా బాలయ్య తల్లి గౌతమి గా బాలీవుడ్ అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని నటించింది . ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 56 కోట్ల పై మాటగా ఉంది . యాభై కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఏరియాల వారీగా గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం - రూ.9. 05 కోట్లు
సీడెడ్ - రూ 9 కోట్లు
వెస్ట్ - రూ3. 06 కోట్లు
కృష్ణా &గుంటూరు - రూ7. 5 కోట్లు
నెల్లూరు - రూ1. 95 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ4. 65 కోట్లు
ఈస్ట్ - రూ3. 5 కోట్లు
కర్ణాటక - రూ3. 85 కోట్లు
ఓవర్ సీస్ - రూ4. 5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ60 లక్షలు
శాటిలైట్ - రూ7 కోట్లు
ఆడియో అండ్ అదర్ రైట్స్ - రూ1. 5 కోట్లు


మొత్తం - రూ.56. 16 కోట్లు