రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తూ రోజురోజుకూ భారీగా అంచనాలు పెంచుతున్న బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమా బాలయ్యకు వందోది కావడంతో అభిమానులు ప్రతి అంశాన్ని గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. శాతకర్ణి సినిమా కోసం బాలయ్య అభిమానులు దేశ వ్యాప్తంగా పుణ్య క్షేత్రాల్లో తిరిగి పూజలు నిర్వహించేందుకు.. యాత్ర చేయబోతున్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం కావడంతో నందమూరి అభిమానులు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యండ్ జగన్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని 100 పుణ్యక్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చనతో పాటు 23 శివలింగాలకు రుద్రాభిషేక, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ భారతదేశ సర్వమత శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర నవంబర్ 5న, శనివారం ఉదయం గం.10.45ని. లకు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది.
