Bigg Boss Telugu 7: శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు.. గౌతమ్ సంచలన ఆరోపణలు.. ఎలిమినేట్ చేయమని వ్యాఖ్య
`బిగ్ బాస్ తెలుగు 7 ` షోలో శుక్రవారం ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఇందులో శివాజీపై గౌతమ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 7.. షో ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. గేముల్లో కంటెస్టెంట్లు ఆటతీరు ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. టాస్క్ లకోసం రెచ్చిపోయి ఆడుతున్నారు. ఫిజికల్ అవుతున్నారు. కంట్రోల్ తప్పుతున్నారు. కొట్టుకునే దశకు వెళ్తున్నారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు శృతి తప్పి మాటలు తిట్టుకుంటున్నారు. శుక్రవారం ఎపిసోడ్‌లో ఇదే జరిగింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇచ్చిన టాస్క్ ల్లో వీరసింహాలు టీమ్ గెలుపొందింది. వారి మధ్య గొనే సంచుల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఇందులో పోటీలో ఉన్న వారు తమ బస్తాలను ఫ్రీగా ఉన్న ఇతర కంటెస్టెంట్లకి ఇచ్చి, వారి చేత గేమ్ ఆడించాల్సి ఉంటుంది. ఆ సంచులను పక్క వారు ఖాళీ చేయాలి, ఒక్కో రౌండ్‌కి ఎవరి బస్తా అయితే తక్కువగా ఉంటుందో వారి ఎలిమినేట్ అవుతారు. ఈ క్రమంలో అమర్ దీప్ రెచ్చిపోయాడు గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. అశ్విని తనని కొట్టిందని ఆరోపించారు. ఆమె తనపై నలుగురు ఎటాక్ చేశారని ఆరోపించింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత తనని కోడుతున్నాడని భోలే ఆరోపించాడు. దానికి కూడా గట్టిగా అరుస్తూ కౌంటర్ ఇచ్చాడు అమర్ దీప్.
మరోవైపు రతిక మధ్యలో వస్తే ఆమెపై కూడా గట్టిగా ఫైర్ అయ్యాడు. కంట్రోల్ తప్పి మాటలు వాగాడు. గేమ్‌ని హీటెక్కించాడు. ఇక ఈ టాస్క్ లో చివరగా తేజ తరపున ఆడిన ప్రియాంక ఎక్కువ ఖాళీ కావడంతో అమర్ దీప్ వద్ద ఉన్న సంచి నిండుగా ఉండటంతో శోభా శెట్టి విన్నర్‌గా నిలిచారు. శోభా బస్తతో అమర్ దీప్ గేమ్ ఆడిన విషయం తెలిసిందే. ఇక మొదటిసారి హౌజ్‌లో లేడీ కెప్టెన్ అయ్యారు. అయితే ఈ గౌరవం తీసుకునే సమయంలో అర్జున్ చేసిన సరదా కామెంట్‌కి కాస్త సీరియస్ అయ్యింది శోభా. కామెడీ కాస్త సీరియస్‌గా మారింది.
ఇదిలా ఉంటే అశ్వినికి సంబంధించి గౌతమ్ చేసిన కామెంట్లు మనస్పర్థాలకు దారితీశాయి. ఇంకోవైపు తనని శివాజీ అన్న దూరం పెడుతున్నాడని,సరిగా చూసుకోవడం లేదని, కొందరిని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాడని అశ్విని ఆరోపించింది. కన్నీళ్లు పెట్టుకుంది. చివర్లో గౌతమ్ కూడా పెద్ద షాకిచ్చాడు. తాను మళ్లి కెప్టెన్ కాకుండా చేయాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఆయన ఆరోపించాడు. హౌజ్ మొత్తం రాంగ్ రూట్‌లో వెళ్తుందని, అంతా తప్పులు చేసి కవర్ చేసుకుంటున్నారని తెలిపారు. తనకు వ్యతిరేకంగా శివాజీ ఈ ప్లాన్ చేస్తున్నాడని, తాను చూడలేకపోతున్నానని, అన్యాయం జరుగుతుందని, తనని డైరెక్ట్ ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించండి అని, ఇది తట్టుకోలేకపోతున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.