Bigg Boss Telugu 7: చెప్పుడు మాటలు విని పెద్ద ఫూల్ అయిన గౌతమ్.. హౌజ్‌లో వీళ్లంతా బంగారం..
బిగ్ బాస్ తెలుగు 7.. శనివారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. ఈ వారం నెలకొన్న సమస్యలతో కంటెస్టెంట్లని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు నాగార్జున. అదే హైలైట్‌గా నిలిచింది.

బిగ్ బాస్ తెలుగు 7.. తొమ్మిదో వారం పూర్తి కావస్తుంది. శనివారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. హౌజ్‌లో నెలకొన్ని అపార్థాలు ఆవేశాలకు దారితీసిన నేపథ్యంలో వాటిని హోస్ట్ నాగార్జున క్లీయర్ చేశాడు. శివాజీ కారణంగా గౌతమ్, అశ్వినీల మధ్య చర్చ పెద్ద రచ్చకి దారితీసింది. దానిపై అందరిలోనూ క్లారిటీ తీసుకొచ్చి కళ్లు తెరిపించాడు నాగ్. అదే సమయంలో హీరో కార్తిని తీసుకొచ్చి కొంత రిలీఫ్ ఇచ్చారు. కాసేపు నవ్వులు పూయించారు.
హీరో కార్తి నటించిన `జపాన్` చిత్రం దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లో హీరో కార్తి సందడి చేశాడు. కాసేపు హౌజ్‌మేట్స్ తో మాట్లాడారు. అనంతరం ఈ వారం జరిగిన పరిణామాలపై అందరిని నిలదీశాడు నాగార్జున. మొదట కెప్టెన్ అయిన శోభా శెట్టిని అభినందించారు. బాగా ఆడిందని, శోభా కోసం ఆడిన అమర్ దీప్‌ని అభినందించారు. ఒక్కో కంటెస్టెంట్‌కి వారి క్రెడిట్‌ని ఇస్తూ శోభాశెట్టికి బంగారం ఇచ్చాడు నాగ్.
అలాగే ఈ వారం బెస్ట్ కెప్టెన్‌గా నిలిచినందుకు గౌతమ్‌కి బంగారం ట్యాగ్ ఇచ్చాడు. శివాజీ విషయంలో నెలకొన్న అపార్థాలను క్లీయర్ చేశాడు. అందులో భాగంగా గౌతమ్.. నిన్నటి ఎపిసోడ్‌లో.. శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు, నన్ను ఎలిమినేట్ చేయాలని వాదించాడు. ఈ రోజు ఎపిసోడ్‌లో దానిపై అందరిని వివరణ అడగ్గా, అదేమీ లేదని ఇతర సభ్యులు తెలిపారు. అందరం కలిసే కెప్టెన్సీ టాస్క్ నుంచి గౌతమ్‌ని తొలగించాలనుకున్నామని తెలిపారు. అయితే అశ్వినీ చెప్పుడు మాటలు విని ఎలా నిర్ణయం తీసుకుంటావు, ఎలా అపార్థం చేసుకుంటావని నాగ్ నిలదీశాడు. అక్కడ శివాజీ చేసిందేమీ లేదని ప్రియాంక, అమర్ దీప్, అర్జున్ కూడా చెప్పారు. దీంతో ఆవేశానికి గురైన గౌతమ్ అందరిలోనూ ఫూల్ అయిపోయాడు.
ఇక భోలే.. తన ఆట సరిగా ఆడనందుకు, ప్రత్యర్థి టీమ్ అనగానే టాస్క్ నుంచి వైదొలగడం సరికాదని ఆయనకు బొగ్గు ట్యాగ్ ఇచ్చాడు నాగ్. యావర్ సైతం గేమ్‌లో డల్ కావడం, మరికొన్ని మనస్పార్థాల కారణంగా సరిగా ఆడనందుకు ఆయనకు కూడా బొగ్గు ట్యాగ్ పడింది. ఇక ఆట బాగా ఆడినందుకు ప్రియాంకకి బంగారం ట్యాగ్ వచ్చింది. పుల్లలు పెట్టినందుకు ఆమెకి బొగ్గు వచ్చింది. టాస్క్ బాగా ఆడినందుకు పల్లవి ప్రశాంత్‌కి బంగారం ట్యాగ్, అర్జున్, శివాజీలకు కూడా బంగారం ట్యాగ్ దక్కింది. సరిగా ఆడనందుకు రతికకి మట్టి ట్యాగ్ పడింది.
శివాజీ అందరికి టార్గెట్ కావడంతో ఆయన్ని కాస్త చూసుకోమని, అలాంటి అపార్థాలకు తావివ్వకుండ చూసుకో అని చెప్పారు నాగ్. మరోవైపు ప్రశాంత్‌తో మాట్లాడుతున్న క్రమంలో ఆయన కన్నీళ్లు పెట్టుకోగా, మధ్యలో దూరి అతడంతే సర్ అని చెప్పడంతో ప్రశాంత్‌ని ఏమన్నా మధ్యలో దూరిపోతావు, మిగిలిన వారి విషయంలో ఎందుకు దూరడం లేదంటూ నిలదీశాడు నాగ్. అలాంటిదేమీ లేదని శివాజీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ రేపు ఆదివారం తేలనుంది. తేజ ఎలిమినేట్ అంటూ తెలుస్తుంది.