పది రోజుల్లో 22కోట్ల వసూళ్లు, గరుడవేగ ఇలా బయటపడ్డట్టే..

First Published 14, Nov 2017, 4:23 PM IST
garudavega collections crossed 22crores
Highlights
  • రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడవేగ
  • పదిరోజుల్లో 22కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన గరుడవేగ
  • అన్నీ కలుపుకుని కలెక్షన్స్ పరంగానూ హిట్ గా నిలిచిన గరుడవేగ

 

రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడవేగ సినిమాపై ముందస్తుగా అంచనాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షుకుల నుంచి పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు. కానీ పాజిటివ్ రివ్యూస్, మౌత్ పబ్లిసిటీ, పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అయితే హై రేంజ్ బడ్జెట్ మూవీ కావడంతో.. వసూళ్లకు, బడ్జెట్ కు పొంతన లేకుండా పోయింది.

 

కానీ రానురాను సినిమాపై పాజిటివ్ పబ్లిసిటీ ప్రభావం పడి సేఫ్ జోన్ లోకి వెళ్లటమే కాక మంచచి లాభాలు కూడా వచ్చినట్లు చెప్తున్నారు. ఈ మూవీ ఇప్పటివరకు థియేట్రికల్ కలెక్షన్స్ ద్వారా రూ.22కోట్లు వసూళ్లు సాధించిందని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

 

దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జట్ తో ‘పీఎస్‌వీ గరుడవేగ’ చిత్రాన్ని  తెరకెక్కించారు. రాజశేఖర్ సినిమాకు ఎన్నడూ లేని విధంగా యూఎస్ లో ఈ సినిమా వసూళ్లు మూడు కోట్ల రూపాయల పైనే వచ్చింది. ఇక ఏపీ, తెలంగాణల వ్యాప్తంగా ఓ మోస్తరు మొత్తం రిటర్న్ అయ్యింది. అయితే.. పాతిక కోట్ల రూపాయల రికవరీ మాత్రం థియేటర్ల దగ్గర నుంచి జరిగే పని కాదని ట్రేడ్ పండితులు తేల్చేశారు.


ఇలాంటి సమయంలో నాన్ థియేటరికల్ రైట్స్ రాజశేఖర్ సినిమాను ఒడ్డున పడేస్తున్నట్టేనని తెలుస్తోంది. డబ్బింగ్, డిజిటిల్, శాటిలైట్ రైట్సే రాజశేఖర్ సినిమాను రక్షిస్తున్నాయని సమాచారం. సినిమాకు పాజిటివ్ టాక్ తో దీన్ని తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లోకి డబ్ చేయడం ఖాయమైంది. అందునా యాక్షన్ థ్రిల్లర్, స్టైలిష్ మేకింగ్.. అనే విశ్లేషణలు ఈ సినిమా డబ్బింగుకు పాజిటివ్ పాయింట్లు అవుతున్నాయి. 

 

సన్నీలియోన్ నటించడం వల్ల దీని హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ మంచి ధరనే పలుకుతున్నాయి. దాదాపు మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు కేవలం హిందీ నుంచినే వచ్చాయని సమాచారం. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా దాదాపు ఇదే స్థాయి మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. ఇక ఇతర భాషల్లోకి డబ్బింగ్ రైట్స్ వల్ల దాదాపు రెండు కోట్ల వరకూ రావచ్చని అంచనా. ఈ రాబడి మొత్తాన్నీ, థియేటర్ల వద్ద వచ్చిన డబ్బును కూడా కలుపుకుంటే.. గరుడవేగ కాస్తో కూస్తో లాభాలు తీసుకొచ్చినట్టే కానీ లాస్ లేదని తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే రాజశేఖర్ తిరిగి గరుడవేగతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

loader