Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవిపై గరికపాటి ఘాటు వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడు.. వైరల్ అవుతున్న వీడియో.!

మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ వేదాంతి గరికపాటి నరసింహారావు తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకే వేదికపై వీరిద్దరూ అతిథులుగా హాజరుకాగా.. చిరు చేసిన పనికి గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన  వీడియో  వైరల్ అవుతోంది. 

Garikapati Narasimharao harsh comments on Chiranjeevis photo session at Alai Balai Celebrations!
Author
First Published Oct 6, 2022, 6:20 PM IST

బీజేపీ లీడర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈరోజు హైదరాబాద్‌లో 'అలై బలై' (Alai Balai) సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అదిరిపోయే స్పీచ్ ఇచ్చి అభిమానులను, కార్యక్రమానికి  హాజరైన ప్రముఖులను ఆకట్టుకున్నారు. అయితే ఇదే కార్యక్రమానికి హాజరైన ప్రముఖ వేదంతి గరికిపాటి నరసింహా రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన పనికి గరికపాటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

అలై బలై వేడుకకు చిరంజీవితో పాటు ప్రముఖ వేదంతి గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. ఈవెంట్ లో చిరంజీవితో ఫోటోలు దిగడానికి పిల్లలు మరియు మహిళలు వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా  వేదికపైనే చిరంజీవి ఫొటో సెషన్ నిర్వహించడంతో గరికపాటి అసహనం వ్యక్తం  చేశారు. అదే సమయంలో గరికిపాటి ప్రసంగం ప్రారంభించడం, మరోవైపు చిరంజీవితో సెల్పీలకు జనం ఎగబడటంతో విసుగెత్తిపోయారు. దీంతో వెంటనే చిరంజీవి గారు మీరు ఫొటో సెషన్ ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని కాస్తా ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో చిరంజీవి కూడా వెంటనే గరికపాటి వ్యాఖ్యలకు స్పందించారు. 

చిరు వల్ల గరికపాటి ప్రసంగానికి అంతరాయం కలగడంతో వెంటనే మెగాస్టార్ కూడా వేదాంతి వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు. అప్పటికే నిర్వాహకులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది. అయితే వేదికపైనే గరికపాటి ఇలా మాట్లాడటం ప్రస్తుతం ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios