ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న టాలీవుడ్ పెద్ద హీరోల మూవీలన్నీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని గమనించిన ‘గని’ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ పై తాజాగా అప్డేట్ ఇచ్చారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ అప్డేట్ అందించారు. కానీ రెండు డేట్లను ప్రకటిస్తూ.. మళ్లీ ఆడియెన్స్ ను ఇరకాటంలో పడేశారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ లోనూ ఇదే జరిగింది.
గద్దల కొండ గణేష్ సినిమా మూవీతో మంచి సక్సెస్ సాధించాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమా తర్వాత… గని మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు.
కాగా, ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది. ఇఫ్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్లు, టీజర్, స్పెషల్ సాంగ్ కు మంచి రెస్సాన్సే వచ్చింది. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ పట్ల మేకర్స్ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రేక్షకులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ‘గని’ మూవీని ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న రిలీజ్ చేయనున్నారు.
పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఫిబ్రవరి 25న లేదంటే మార్చి 4న రిలీజ్ చేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. అయితే, అన్ని సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అవుతున్నందున హెల్తీ వాతావరణంలో తమ మూవీని రిలీజ్ చేయనున్నామని తెలిపారు. ఇతర సినిమాల రిలీజ్ డేట్ల ఆధారంగా గని మూవీని రిలీజ్ చేయనున్నట్టు కూడా చెప్పారు.
ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లకు మంచి ఆదరణ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ పై మేకర్స్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో ఆడియెన్స్ కొంత నిరాశ చెందుతున్నారు.
అయితే ఇదే తరహాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని కూడా మార్చి 18కి లేదంటే, ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత ‘మార్చి 25’న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విధంగా గని రిలీజ్ డేట్ ను మరోసారి ఫైనల్ చేయనున్నారరేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ ను గమనంలో ఉంచుకున్న ‘గని’ మూవీ మేకర్స్ ‘ఆర్ఆర్ఆర్’కు ముందే రిలీజ్ చేయాలనుకుంటన్నారు.
‘గని’ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్‘గని’ సినిమాతో పాటు ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీ చేస్తోంది. ఈ సినిమాలో మరోసారి వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.
