బిగ్ బాస్ మొదలై మూడురోజులవుతుండగా ఆసక్తికర సంగతులేవి జరగలేదు.  బిగ్ బాస్ హౌస్ మసాలా ఏమి లేకుండా సప్పగా సాగుతుందనే చెప్పాలి. కరోనా వైరస్ కారణం కావచ్చు లేదా మరే ఇతర కారణాలైనా కావచ్చు కొంచెం జనాలకు తెలిసిన సెలబ్రిటీలు షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదని సమాచారం. దీనితో షోలో పాల్గొన్న సగానికి పైగా సభ్యుల ముఖాలు ఎవరికీ పెద్దగా తెలియదు. 

పేరున్న సెలబ్రిటీలు లేని కారణంగా బిగ్ బాస్ పై ప్రేక్షకులకు ఆసక్తి పూర్తి స్థాయిలో కలుగలేదు. దానికి తోడు ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే, అలాగే టాస్క్ లు, గేమ్ లు, ఎలిమినేషన్స్ మొదలు కాలేదు. అందువలన గత మూడు ఎపిసోడ్స్  ఆశాజనకంగా సాగలేదు. వృద్ధురాలు అయినప్పటికీ గంగవ్వ జోరు ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ప్యూర్ తెలంగాణా స్లాంగ్ లో ఆమె డైలాగ్స్, పంచెస్ వినోదం పంచుతున్నాయి. 

బిగ్ బాస్ ప్రోమోలలో కూడా గంగవ్వనే హైలెట్ చేస్తున్నారు. గ్లామర్ పంచే అమ్మాయిలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకుల ఫోకస్ మాత్రం గంగవ్వపైనే ఉంటుంది. చాలా వరకు ప్రోమోలలో గంగవ్వనే హైలెట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమోలో కూడా గంగవ్వ బిగ్ బాస్ కి ముద్దులు ఇస్తూ, ఎక్సర్సైజ్ లు చేస్తూ సందడి చేస్తూ కనిపించారు. నువ్వు కట్టుకున్న చీర మినహా అన్ని చీరలు నాకు ఇచ్చేయాలని హారిక అడుగగా, నేనేందుకు ఇస్తానని గంగవ్వ పంచ్ వేసింది.