ప్రేక్షక ఆదరణ ఉన్నప్పటికీ హౌస్ నుండి స్వచ్ఛందంగా బయటికి వచ్చేసింది గంగవ్వ. ఆమె ఆరోగ్య సరిగా లేకపోవడంతో పాటు, తిండి, నిద్ర లేదని చెప్పి బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయగా ఆయన ఇంటికి పంపేశారు. ఈ పరిణామం గంగవ్వ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. ఎలాగైనా ఆమెను గెలిపించుకుందామన్న వాళ్ళ కలలు చెరిగిపోయాయి. హౌస్ నుండి మధ్యంతరంగా బయటికి వచ్చినప్పటికీ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఆమె కల నెరవేరుస్తాను అన్నాడు. ఆమె కోరుకున్నట్లు ఒక మంచి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 

బిగ్ బాస్ పాల్గొన్న గంగవ్వ ఇమేజ్ చాలా పెరిగిపోయింది. దీనితో అనేక చానళ్ళు ఆమెను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ మూవీ మ్యాగజైన్ సంతోషం అధినేత సురేష్ కొండేటి గంగవ్వను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె నుండి పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. ముఖ్యంగా గంగవ్వ ఇల్లు గురించి అడిగారు. హైదరాబాదులో ఇల్లు కట్టిస్తే వస్తావా..అని అడుగగా అసలు రాను అంది. ఇక్కడ అసలు మట్టి కనిపించదు. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించినా ఇక్కడి రాను, మా ఊళ్ళోనే నాకు ఇల్లు కావాలి అంది. 

హౌస్ లోకి వెళ్లిన వెంటనే అనారోగ్యం పాలయ్యావు, అప్పుడు గుండె దిటవు చేసుకొని ఉన్నావు, మరి ఈ సారి ఎందుకు వచేశావ్ అని అడుగగా, నా పిల్లలపై మనసు మళ్లింది. దిగులుతో వచ్చేశానని సమాధానం చెప్పింది. గెలిస్తే 50లక్షలు వచ్చే కదా అన్న ప్రశ్నకు ఎంత ఉన్నా తినేది అంతే కదా, ఉన్నదాంతో సంతృప్తి పడాలని గంగవ్వ చెప్పుకొచ్చింది. ప్రోమోలో ఈ విషయాలు బయట పెట్టగా పూర్తి ఎపిసోడ్ రేపు ప్రసారం కానుంది.