నేచురల్‌ స్టార్‌ నాని,డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'గ్యాంగ్ లీడర్'. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.28 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది. 

ఏరియాల వారీగా వివరాలు.. 
నైజాం............................................... రూ.8.00 కోట్లు 
సీడెడ్............................................... రూ.3.60 కోట్లు 
ఉత్తరాంధ్ర...................................... రూ.2.50 కోట్లు 
గుంటూరు......................................... రూ.1.80 కోట్లు 
ఈస్ట్................................................... రూ.1.60 కోట్లు 
వెస్ట్..................................................... రూ.1.20 కోట్లు 
కృష్ణ..................................................... రూ.1.45 కోట్లు 
నెల్లూరు.............................................. రూ.0.75 కోట్లు 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.20.90 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ది ఇండియా రూ.1.80 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5.50 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.28.20 కోట్ల బిజినెస్ జరుపుకొంది.